
📌 Key Points
- మన శంకర వరప్రసాద్ గారు మూవీతో అనిల్ రావిపూడి క్రేజ్ అమాంతం పెరిగింది, ఇది బ్లాక్ బస్టర్ హిట్!
- అనిల్ రావిపూడి రెమ్యునరేషన్ 20 నుండి 25 కోట్లకు చేరినట్లు టాలీవుడ్ టాక్, ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్!
- సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది, ఇది ఒక సంచలనం!
- స్టార్ హీరోలతో వరుస అవకాశాలు, రాజమౌళి తర్వాత సక్సెస్ రేటులో అనిల్ రావిపూడి టాప్ డైరెక్టర్!
టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. చిరంజీవితో ఆయన చేసిన సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆయన రేంజ్ మారిపోయింది. ఇప్పుడు ఆయన రెమ్యునరేషన్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు.
చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్, అనిల్ దశ తిరిగింది!
టాలీవుడ్ లో ప్రస్తుతం అనిల్ రావిపూడి రేంజ్ వేరు. పట్టిందల్ల బంగారం అయినట్టుగా.. చేసిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో చేసిన మన శంకర వరప్రసాద్ గారు ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. చిరంజీవి ఎవరూ చూపించని విధంగా అనిల్ చూపించాడు. 70 ఏళ్ల వయసులో వింటేజ్ లుక్ లో మెగాస్టార్ మెరిసిపోయాడు. ఆయనలో ఉన్న ఎనర్జీని మరోసారి బయటకు తీశాడు అనిల్. దాంతో సినిమా సూపర హిట్ అయ్యింది.. అనిల్ రేంజ్ మరో రేంజ్ కు వెళ్లిపోయింది.
అసలే వరుససక్సెస్ లు..ఆపైన స్టార్ హీరోలతో వరుస అవకావాలు.. అనిల్ ను స్టార్ డైరెక్టర్ గా మార్చాయి. రాజమౌళి తరువాత సక్సెస్ రేటు పూర్తి స్థాయిలో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రమే. కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే.. సెంటిమెంట్ తో ఏడించగలగడం అనిల్ కు బాగా వచ్చిన విద్య. ఆయన సినిమాలో హీరోయిజం డిఫరెంట్ గా ఉంటుంది. ఎంత సీరియస్ క్యారెక్టర్ అయినా కామెడీ చేయించగలడు.. కామెడీ హీరోతో సీరియస్ పాత్రలు కూడా చేయించగలడు, ఈ మధ్యలో హీరో ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్త పడతాడు అనిల్ రావిపూడి.
రెమ్యునరేషన్ అమాంతం పెంపు, టాలీవుడ్ లో హాట్ టాపిక్!
అనిల్ రావిపూడి దగ్గర ఉన్న పెద్ద ట్యాలెంట్ ఏంటంటే.. ఆయన స్టార్ హీరో అయినా.. కొత్త హీరోఅయినా.. తన కథతో అద్భుతమైన విజయం అందేలా చేయగలడు. అందుకే గ్యారెంటీ హీరోగా అనిల్ కు పేరు పడింది. ఇక సినిమా సినిమాకు సక్సెస్ సాధిస్తూ వెళ్తున్న అనిల్.. రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో పెంచుకుంటూ వెళ్తున్నట్టు తెలుస్తోంది. అన్ని జానర్స్ కు తగ్గ ప్రేక్షకులకి నచ్చేలా సినిమాలు చేయడంలో అనిల్ రావిపూడి రూటే సెపరేటు. స్టార్ దర్శకుడిగా టాలీవుడ్ లో దూసుకుపోతున్న ప్రస్తుతం అనిల్ రావిపూడి కోసం స్టార్ ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారు. స్టార్ హీరోలు కూడా అనిల్ తో సినిమా అంటే.. కళ్లు మూసుకుని ఒకే చేసే పనిస్థితి
మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు అనిల్ రావిపూడి 20 నుంచి 25 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఛార్జ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సంక్రాంతికి వస్తున్నాం ముందు వరకు అనిల్ రావిపూడి 15 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకునే వారు. కానీ సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఏకంగా 300 కోట్ల గ్రాస్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీనితో అనిల్ తన పారితోషికం పెంచినట్లు తెలుస్తోంది. అయితే మన శంకర వరప్రసాద్ గారు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో… తాజాగా అనిల్ రేంజ్ మరో స్థాయికి వెళ్లింది. ఈసారి ఆయన చేయబోయే సినిమాకు 30 కోట్లకు పైనే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట అనిల్.
నెక్స్ట్ మూవీకి అనిల్ రావిపూడి ఎంత ఛార్జ్ చేస్తారో?
గతేడాది సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్.. ఈ ఏడాది చిరంజీవి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా ఏంటి ? ఏ హీరోతో చేయబోతున్నారు ? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అనిల్ రావిపూడి సీనియర్ హీరోలందరినీ చుట్టేస్తున్నారు. వెంకటేష్,బాలయ్య, చిరంజీవి అయిపోయాడు ఇక మిగిలింది నాగార్జున మాత్రమే. అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ నాగార్జునతో చేయబోతున్నట్టు తెలుస్తోంది. అది కూడా హలో బ్రదర్ సినిమాకు సీక్వెల్ ను ప్లాన్ చేసినట్టు సమాచారం.
అనిల్ రావిపూడి దూకుడు చూస్తుంటే టాలీవుడ్ లో మరిన్ని సంచలనాలు సృష్టించేలా ఉన్నారు. ఆయన తదుపరి సినిమాల గురించి మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి.


