
📌 Key Points
- వెంకీ, ఫహద్ ఫాజిల్ బావా బామర్ధులుగా స్క్రీన్‌పై సందడి చేయనున్నారు!
- అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో కథ సిద్ధం!
- 2027 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం!
- సాహు గారపాటి, సురేష్ బాబు నిర్మాణంలో భారీ చిత్రం రానుంది!
టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో సంచలనానికి సిద్ధమయ్యారు. ఈసారి విక్టరీ వెంకటేష్‌తో కలిసి మల్టీస్టారర్ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
వెంకీ, ఫహద్ ఫాజిల్ కాంబోలో బావా బామర్ధుల సందడి!
Anil Ravipudi : అనిల్ రావిపూడి అంటే సంక్రాంతి.. సంక్రాంతి అంటే అనిల్ రావిపూడి. ప్రతి సంక్రాంతికి అనిల్ రావిపూడి డైరెక్షన్ నుంచి సినిమా రావాల్సిందే అన్నట్లుగా మారిపోయింది సీన్. ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ మూవీతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి కూడా రెడీ అవుతున్నాడట. జూన్‌లోపు స్క్రిప్ట్ వర్క్ ఫినీష్ చేసి త్వరగా సెట్స్ మీదకు వెళ్లేందుకు డిస్కషన్స్ జరుగుతున్నాయట. మరోసారి వెంకీతో ప్రయోగం చేయబోతున్నాడట అనిల్. ఇది చిత్తూరు బ్యాక్ డ్రాప్‌లో జరిగే స్టోరీ అని టాక్ నడుస్తుంది.
చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో అనిల్ రావిపూడి కథ!
అనిల్ రావిపూడి, వెంకీ కాంబోలో రాబోయే మూవీలో నటుడు ఫహద్ ఫాజిల్ కూడా నటించబోతున్నాడని టాక్. వెంకీ, ఫహద్ ఫాజిల్ ఇద్దరు బావా బామర్ధులుగా స్క్రీన్ మీద ఆకట్టుకోబోతున్నారట. ఈ సినిమా 2027 జనవరి 12న సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట అనిల్.
2027 సంక్రాంతికి విడుదల.. పండగే పండగ!
ఇక పండగకు వస్తున్నాం అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందంటున్నారు. అయితే ఫహద్ ఫాజిల్ రెమ్యూనరేషన్ బాగానే డిమాండ్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాను కూడా సాహు గారపాటి నిర్మాతగా, మరో ప్రొడ్యూసర్‌గా సురేష్ బాబు నిర్మాణంలో రాబోతోందట. అయితే రానా కూడా ఓ స్పెషల్ రోల్ చెయ్యబోతున్నాడనే టాక్ నడుస్తుంది. మరో వారంలో అనిల్ రావిపూడి ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
అనిల్ రావిపూడి, వెంకీ కాంబినేషన్లో వస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


