
📌 Key Points
- అనిల్ రావిపూడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా ‘పటాస్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
- దర్శకుడు అనిల్ రావిపూడి త్వరలో వెంకటేష్‌తో మరో సినిమా చేయనున్నట్లు సమాచారం.
- చిరంజీవితో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి.
- సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ చేసే ఆలోచన లేదని స్పష్టం చేసిన అనిల్ రావిపూడి.
అనిల్ రావిపూడి మరోసారి తన లక్కీ కాంబినేషన్‌ను రిపీట్ చేసేందుకు సిద్ధమయ్యారు. వెంకటేష్‌తో కలిసి ఆయన త్వరలో సినిమా చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
అనిల్ రావిపూడి సినీ ప్రస్థానం
Anil Ravipudi:సాధారణంగా సినీ ఇండస్ట్రీలో దర్శక – హీరో లేదా హీరో – హీరోయిన్ లేదా ఒక దర్శకుడు – ఒక నిర్మాణ సంస్థ.. ఒక సినిమాతో మంచి విజయం అందుకున్నారు అంటే మళ్ళీ అదే కాంబో రిపీట్ అవ్వడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి తనకు కలిసొచ్చిన ఒక స్టార్ హీరోతో మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తూ వరుస విజయాలు అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే సినీ రచయితగా, దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నారు అనిల్ రావిపూడి.
‘పటాస్’ అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన అనిల్ రావిపూడి (Anil Ravipudi) అంతకుముందు కందిరీగ, మసాలా, ఆగడు వంటి పలు చిత్రాలకు రచయితగా పనిచేశాడు. ఇకపోతే నందమూరి హీరో కళ్యాణ్ రామ్ (Kalyan Ram) వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న సమయంలో పటాస్ సినిమా చేసి మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని ఆయన ఖాతాలో చేరవేశారు. దీనికి తోడు ఈ సినిమాతో దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు అనిల్ రావిపూడి. ఆ తర్వాత సుప్రీం, రాజా ది గ్రేట్ , ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు , ఎఫ్ 3, భగవంత్ కేసరి , సంక్రాంతికి వస్తున్నాం అంటూ పలు చిత్రాలు చేసిన ఈయన.. ఏడాదికో సినిమాతో ఆడియన్స్ ను మెప్పిస్తూ స్టార్ డైరెక్టర్గా పేరు దక్కించుకున్నారు.
వెంకటేష్‌తో మళ్ళీ సినిమా?
ఈ ఏడాది చిరంజీవి (Chiranjeevi) తో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా చేసి ఈ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు అనిల్ రావిపూడి. ఇకపోతే తన తదుపరి ప్రాజెక్టు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్ అంటూ గత కొంతకాలంగా వార్తలు రాగా.. దీనిపై ఆయన క్లారిటీ ఇస్తూ సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ చేసే ఆలోచన లేదు అని క్లారిటీ ఇచ్చారు. అలాగే మహేష్ బాబుతో సినిమా చేస్తారు అంటూ వచ్చిన వార్తలు కూడా నిజం కాలేదు. ఇకపోతే మరో రెండు వారాల్లో వైజాగ్ కి వెళ్లి.. నా కొత్త సినిమా ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు మొదలు పెడతాను. మరో వారంలో పూర్తి వివరాలు తెలియజేస్తాను అంటూ అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మళ్లీ ఆ స్టార్ హీరో తోనే అనిల్ రావిపూడి తన కొత్త సినిమా చేయబోతున్నారని సమాచారం. అంతేకాదు ఆ హీరోతో మళ్లీ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు వెంకటేష్ (Venkatesh). ఇప్పటికే వెంకటేష్ తో ఎఫ్2 , ఎఫ్3 సినిమాలు చేసి మంచి విజయాన్ని అందుకున్న వెంకటేష్.. గత ఏడాది సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేసి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే హీరోతో అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నట్లు సమాచారం.
సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే నెక్స్ట్ సంక్రాంతి టార్గెట్గా మళ్లీ వెంకటేష్ తోనే అనిల్ రావిపూడి సినిమా చేయనున్నట్లు.. త్వరలోనే దీనిపై ఆయన నుంచి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ముఖ్యంగా వెంకటేష్ తో హీరో గానే కాకుండా వేరే హీరోలతో చేస్తున్న సినిమాలలో కూడా ఆయనకు అవకాశాన్ని కల్పిస్తున్నారు అనిల్ రావిపూడి. అందుకే అనిల్ రావిపూడి కి వెంకటేష్ సెంటిమెంట్ హీరోగా మారారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
మొత్తానికి అనిల్ రావిపూడి తన తదుపరి సినిమా వెంకటేష్‌తో చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో వీరిద్దరూ మరో విజయాన్ని అందుకుంటారో లేదో చూడాలి.


