
📌 Key Points
- వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబోలో అనిల్ రావిపూడి మూవీ: ఓటీటీ హక్కులు రికార్డ్ ధర పలికాయి!
- రూ. 70 కోట్ల భారీ ధరకు ఓటీటీ హక్కులు కొనుగోలు చేసిన అగ్ర సంస్థ!
- అనిల్ రావిపూడి నమ్మకంతోనే భారీ మొత్తం వెచ్చించిన ఓటీటీ సంస్థ వర్గాలు!
- సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు!
టాలీవుడ్ లో సంచలనం! అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న సినిమా ఇంకా ప్రారంభం కాకముందే భారీ రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులు ఎంతకు అమ్ముడుపోయాయో తెలిస్తే షాక్ అవుతారు.
అనిల్ రావిపూడి నమ్మకమే పెట్టుబడి
Anil Ravipudi : అనిల్ రావిపూడి సినిమా సినిమాకు తన రేంజ్ ని పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. తక్కువ బడ్జెట్లో సినిమాలు చేసి నిర్మాతలకు భారీ ప్రాఫిట్స్ తెచ్చిపెడుతున్నారు అనిల్ రావిపూడి. ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించేలా చేస్తున్నాడు అనిల్. ఇటీవల సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ సినిమాతో రీజనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎవ్వరూ ఊహించని కాంబినేషన్ వెంకటేష్ – కళ్యాణ్ రామ్ తో సినిమా చేస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే షూటింగ్ మొదలవ్వనుంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా మొదలవ్వకుండానే బిజినెస్ కూడా జరిగిపోతుంది. తాజా సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకు ఓటీటీ, శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయని సమాచారం.
ఓటీటీలో రికార్డు ధర పలికిన హక్కులు
ఓ అగ్ర ఓటీటీ సంస్థ వెంకటేష్ – కళ్యాణ్ రామ్ కాంబోతో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా హక్కులను ఏకంగా 70 కోట్లు ఇచ్చి కొనుక్కుంటుందట. కళ్యాణ్ రామ్, వెంకటేష్ మార్కెట్ కి ఇది చాలా ఎక్కువే అని సమాచారం. కేవలం అనిల్ రావిపూడిని నమ్మే ఇంత పెట్టి కొనుక్కున్నారట సినిమాని. దీంతో ఈ అమ్మకం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చగా మారింది.
సంక్రాంతికి రానున్న బ్లాక్ బస్టర్!
ఎలాగో అనిల్ రావిపూడి సినిమా హిట్, సంక్రాంతికి వస్తే భారీ కలెక్షన్స్ ఖాయం, దీనికి తోడు వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్, కళ్యాణ్ రామ్ కోసం నందమూరి ఫ్యాన్స్.. ఇవన్నీ ఈ సినిమాకు కమర్షియల్ గా ముందు నుంచే వర్కౌట్ అవుతున్నాయి. దీంతో సినిమా రిలీజ్ తర్వాత హిట్ కొట్టి కాదు సినిమా రిలీజ్ కి ముందే నిర్మాతకు లాభాలు తెచ్చిపెడుతున్నారు అనిల్ రావిపూడి అని అందరూ మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి అనిల్ రావిపూడి నిర్మాతలకు బంగారు బాతులా మారాడు.
అనిల్ రావిపూడి సినిమా విడుదల కాకముందే నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


