
📌 Key Points
- అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా సినిమా.
- హీరోయిన్లుగా పూజా హెగ్డే, కీర్తి సురేష్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
- విలన్‌గా ఫహద్ ఫాజిల్ నటిస్తారనే వార్తల్లో నిజం లేదు.
- సినిమాకు ‘శ్రీమతిలత వెంకటరెడ్డి’ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో అనిల్ రావిపూడి.
దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్‌తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘శ్రీమతిలత వెంకటరెడ్డి’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ ఎవరితో?
Anil Ravipudi: హిట్ మిషన్ అనిల్ రావిపూడి ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్నారు. పటాస్ సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయం అయిన అనిల్ రావిపూడి(Anil Ravipudi) మొదటి సినిమా నుంచి కూడా ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు ఈయన డైరెక్షన్ లో తొమ్మిది సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా ఈ తొమ్మిది సినిమాలు కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో పదవ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి తన పదవి సినిమాని ఏ హీరోతో చేయబోతున్నారు? ఈ సినిమా నేపథ్యం ఏంటి ?అనే అంశాలపై అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇందులో వెంకటేష్ హీరోగా నటించగా, హీరోయిన్ పాత్రలో పూజా హెగ్డే, కీర్తి సురేష్ నటించబోతున్నారు అంటూ కొంతమంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇక విలన్ గా పహద్ ఫాజిల్ నటించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నప్పటికీ ఈ వార్తలు పై అనిల్ రావిపూడి ఎక్కడ కూడా స్పందించలేదు. అయితే ఇప్పటికే ఈయన ఈ సినిమాకు అద్భుతమైన టైటిల్ ఫిక్స్ చేశానని ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.
వెంకటేష్ పాత్ర ఎలా ఉండబోతోంది?
ఇక ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ ఇప్పటికే ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం, అదిరిపోద్ది సంక్రాంతి అని టైటిల్స్ తెరపైకి వచ్చాయి కానీ అనిల్ రావిపూడి మాత్రం ఈ సినిమాకు శ్రీమతిలత వెంకటరెడ్డి అని టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారని, ఈ టైటిల్ దాదాపు కన్ఫామ్ అయ్యింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదే కనుక నిజమైతే ఈ సినిమాలో వెంకటేష్ వెంకటరెడ్డి అనే పాత్రలో కనిపించబోతున్నారని స్పష్టమవుతుంది.
వెంకటరెడ్డి పాత్రలో వెంకటేష్..
శ్రీమతిలత వెంకటరెడ్డి టైటిల్ ఫిక్స్ అయిందా?
అనిల్ రావిపూడి ఇదివరకు దర్శకత్వం వహించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఈయన వెంకి గౌడ అనే పాత్రలో కనిపించి సందడి చేశారు. ఈయన సుమారు 25 నిమిషాలపాటు స్క్రీన్ పై సందడి చేసినప్పటికీ చిరంజీవి వెంకటేష్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఇప్పుడు మరోసారి వెంకటేష్ తో చేయబోయే సినిమాలో కూడా ఈయన వెంకటరెడ్డి అనే పాత్రలో కనిపించబోతున్నారని తెలిసిన అభిమానులు వెంకటేష్ పాత్ర ఎలా ఉండబోతుందో ఊహించుకుంటున్నారు. మరి శ్రీమతిలత వెంకటరెడ్డి అనే టైటిల్ గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వెంకటేష్ గతంలో ‘మన శంకర వరప్రసాద్’ సినిమాలో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.


