
📌 Key Points
- సంక్రాంతికి విడుదలైన ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో నాగవంశీ సక్సెస్ సాధించారు.
- గతంలో విమర్శలు ఎదుర్కొన్న నాగవంశీకి ఈ సినిమాతో పరిశ్రమ మద్దతు లభించింది.
- సినిమా కోసం కష్టపడుతున్న అభిమానులకు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తానని నాగవంశీ తెలిపారు.
- సినిమా విడుదల ముందు రెండు రాత్రులు నిద్రలేకుండా టెన్షన్ పడ్డానని నాగవంశీ వెల్లడించారు.
టాలీవుడ్ నిర్మాత నాగవంశీ సంక్రాంతికి విడుదలైన ‘అనగనగా ఒక రాజు’ సినిమా విజయంపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సినిమాకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అభిమానులకు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తానని ప్రకటించారు.
నాగవంశీ సక్సెస్ వెనుక కథ
Nagavamsi: టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి .ఇలా సంక్రాంతి బరిలో స్టార్ హీరోలతో పోటీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వారిలో నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు (Anaganaga oka Raju) సినిమా ఒకటి. డైరెక్టర్ మారి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ(Nagavamsi) నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీ విడుదల అయింది. ఈ సినిమా మంచి ఆదరణ సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. ప్రతి ఒక్కరు వేదిక పై సినిమా గురించి మాట్లాడుతూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు నాగ వంశీ ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ పలు విషయాలను బయటపెట్టారు. తనకు సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టాలనే ఈగో ఉండేది ఈ సినిమాతో నా ఈగో సాటిస్ఫాక్షన్ అయిందని తెలిపారు. గత రెండు సినిమాల విషయంలో నాపై ఎన్నో విమర్శలు వచ్చాయి కానీ ఈ సినిమా విషయంలో ప్రతి ఒక్కరూ సక్సెస్ కావాలని కోరుకున్నారు అంటూ నాగ వంశీ తెలియజేశారు.
ఫ్యాన్స్ కోసం రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్
ఈ సినిమా విషయంలో తనకు మీడియా సపోర్ట్ మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో కొంతమంది ప్రొడ్యూసర్ల సపోర్ట్ కూడా పూర్తిగా లభించిందని అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక గత 72 గంటల నుంచి ఫ్యాన్ బాయ్స్ సోషల్ మీడియాలో ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. మరొక పది రోజులు ఇలాగే కష్టపడండి ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తాయి మీకు మంచి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాను అంటూ నాగ వంశీ ఈ సందర్భంగా తెలియజేశారు. మరి ఈయన ఫ్యాన్ బాయ్స్ కు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారో తెలియాల్సి ఉంది.
టెన్షన్ తో నిద్ర రాలేదు..
నిద్రలేని రాత్రులు.. టెన్షన్!
ఈ సినిమా విషయంలో తాను చాలా టెన్షన్ పడ్డాననీ, వరుసగా రెండు సినిమాలు నిరాశ పరచడంతో ఈ సినిమా విషయంలో చాలా టెన్షన్ పడ్డాను ఆ టెన్షన్ కారణంగా 12, 13 తేది రాత్రులు తనకు నిద్ర కూడా పట్టలేదని, కానీ సినిమాకు మంచి సక్సెస్ ఇవ్వటంతో చాలా హ్యాపీగా ఉందని తెలిపారు. తాను ఆరు సంవత్సరాల క్రితం సంక్రాంతి పండుగ సందర్భంగా అలా వైకుంఠపురం సినిమా ద్వారా సక్సెస్ అందుకున్నాను తిరిగి ఆరు సంవత్సరాలకు మరీ సంక్రాంతి సినిమాతో హిట్ కొట్టాను అంటూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. నాగ వంశీ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కింగ్డమ్, మాస్ జాతర వంటి సినిమాలు డిజాస్టర్ లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ నటించిన వార్ 2 తెలుగు రైట్స్ ఈయన కొనుగోలు చేశారు. ఈ సినిమా కూడా నిరాశపరిచింది. దీంతో అనగనగా ఒక రాజు సినిమా విషయంలో చాలా కంగారు పడ్డానని నాగ వంశీ ఈ సందర్భంగా తెలియజేశారు.
మొత్తానికి నాగవంశీ ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో విజయం సాధించి, తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారికి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన భవిష్యత్తు ప్రాజెక్టుల కోసం ఎదురుచూద్దాం.


