
📌 Key Points
- ప్రధాని మోదీ రామ్ చరణ్‌ను “న్యూ ఏజ్ మెగాస్టార్” అని సంబోధించారు.
- ఈ గుర్తింపుపై చిరంజీవి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.
- చరణ్ కృషి, అంకితభావం, గ్లోబల్ గుర్తింపు పట్ల చిరు గర్వం వ్యక్తం చేశారు.
- రామ్ చరణ్ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశారని చిరు ఆకాంక్షించారు.
మెగాస్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్‌పై ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ రామ్ చరణ్‌ను “న్యూ ఏజ్ మెగాస్టార్” అని ప్రశంసించడంతో, చిరంజీవి గర్వంతో ఉప్పొంగిపోయారు. చరణ్ సాధించిన విజయాలను కొనియాడుతూ, ఆయన భవిష్యత్తుకు ఆకాంక్షలు తెలిపారు.
ప్రధాని మోదీ ప్రశంసలు: “న్యూ ఏజ్ మెగాస్టార్”
Ram Charan Praise : ‘పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!’ ఒక కొడుకు పుట్టినప్పుడు తండ్రికి కలిగే ఆనందం కంటే, ఆ కొడుకు సాధించిన విజయాలను చూసి సమాజం మెచ్చుకుంటున్నప్పుడు కలిగే ఆనందం వెలకట్టలేనిది. ఈ సత్యాన్ని అక్షరాలా నిజం చేస్తూ, మెగాస్టార్ చిరంజీవి తన సుపుత్రుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను ఉద్దేశించి సాషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. తాజాగా దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read also- వెంకీ లుక్ పై క్రేజీ రూమర్.. అనిల్ ప్లానేంటో అర్థంకాలేదే..!
ఇటీవల రిపబ్లిక్ టీవీ నిర్వహించిన ఒక ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రామ్ చరణ్‌ను “న్యూ ఏజ్ మెగాస్టార్” (New Age MegaStar) అని సంబోధించడం విశేషం. దేశ ప్రధాని నోట తన కొడుకు గురించి ఇంతటి గొప్ప మాట రావడంపై చిరంజీవి అత్యంత ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేశారు. ఈ గుర్తింపుపై చిరంజీవి స్పందిస్తూ ఇలా రాసుకొచ్చారు..
తండ్రిగా చిరంజీవి గర్వం
‘ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా నా గుండె గర్వంతో నిండిపోతోంది. చరణ్ తన కఠోర కృషి, అంకితభావం, అద్భుతమైన నటనతో కేవలం ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా, ప్రపంచస్థాయిలో విశేషమైన గుర్తింపును సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం.’ అంటూ రాసుకొచ్చారు.
Read also- Dharman Poster: డాక్టర్ అవతారంలో సూపర్ స్టార్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రజనీకాంత్!
రామ్ చరణ్ కేవలం ఒక నటుడిగానే కాకుండా, ‘RRR’ సినిమాతో అంతర్జాతీయ వేదికలపై తెలుగు సినిమా పతాకాన్ని ఎగురవేశారు. రానున్న రోజుల్లో చరణ్ ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని చిరంజీవి మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. తండ్రిని మించిన తనయుడిగా రామ్ చరణ్ ఎదుగుతుంటే, ఆ ఎదుగుదలను చూసి మురిసిపోతున్న మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ ఇప్పుడు మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. “నిజమైన పుత్రోత్సాహం అంటే ఇదే” అంటూ నెటిజన్లు కూడా చిరు, చరణ్‌లపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
చరణ్ విజయాలు, భవిష్యత్ ఆకాంక్షలు
“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!”
నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను “𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧” అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని… pic.twitter.com/sbddqa3m61
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 24, 2026
తండ్రిని మించిన తనయుడిగా రామ్ చరణ్ ఎదుగుతుంటే, ఆ ఎదుగుదలను చూసి మెగాస్టార్ చిరంజీవి మురిసిపోతున్నారు. ఈ ఎమోషనల్ పోస్ట్ మెగా అభిమానులను ఆకట్టుకుంటూ, తండ్రి కొడుకుల బంధానికి నిదర్శనంగా నిలుస్తోంది.


