
📌 Key Points
- మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 1న రిలీజ్!
- ప్రపంచవ్యాప్తంగా రూ.375 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ!
- వెంకటేష్ గారితో కలిసి సినిమా చేయనున్న అనిల్ రావిపూడి, ఫహాద్ ఫాజిల్ కూడా నటిస్తున్నట్లు సమాచారం!
- రఘువరన్ అంటే ఇష్టమని, విలన్ పాత్రలో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపిన అనిల్ రావిపూడి!
టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పుడు ఒక సంచలన ప్రకటన చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా భారీ విజయం సాధించిన తర్వాత, అనిల్ రావిపూడి విలన్ పాత్రలో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
విలన్ గా మారనున్న అనిల్ రావిపూడి?
టాలీవుడ్‌లో ప్రస్తుతం హిట్ డైరెక్టర్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనిల్ రావిపూడి(Anil Ravipudi). ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ డైరెక్టర్ పేరు తెలుగు ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. వరుస విజయాలతో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. రీసెంట్‌గా ఆయన తెరకెక్కించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara vara prasad garu) సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 1న విడుదలై బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని సాధించింది. ఇప్పటి వరకు రూ.375 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి నాలుగు వందల కోట్లకు చేరువలో ఉంది.
375 కోట్ల వసూళ్లు సాధించిన మెగా మూవీ!
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటించిన ఈ మూవీలో నయనతార(Nayanatara) హీరోయిన్‌గా కనిపించింది. ఇక టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో కనిపించి అలరించారు. ఇక ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. ప్రస్తుతం ఆయన విక్టరీ వెంకటేష్ (Venkatesh)తో సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న అనిల్.. ఈ సినిమాలో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) నటిస్తోన్నట్లు సమాచారం.
వెంకటేష్, ఫహాద్‌తో అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ!
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతన్ని మీకు సినిమాల్లో నటించే అవకాశం వస్తే.. హీరోగా చేస్తారా విలన్‌గా చేస్తారా అని యాంకర్ అడుగగా.. దానికి అతను స్పందిస్తూ.. ‘విలన్‌గా చేస్తా.. విలన్స్‌లో నా ఫేవరేట్ విలన్ రఘువరన్.. నా సినిమాల్లోని పంచ్ డైలాగ్స్‌లో నేను ఎక్కువగా వాడేది నాకు ఊతపదంలా అలవాటైన పంచ్ డైలాగ్ అంతేగా అంతేగా.. దీన్నే ఎక్కువగా వాడుతాను’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
అనిల్ రావిపూడి విలన్ గా నటించే అవకాశం వస్తే ఎలా ఉంటుందో చూడటానికి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


