|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనిల్ రావిపూడి సవాల్: “నా సినిమాతో అభిమానులను టైం మెషిన్‌లో గిర్రున తిప్పుతా!”

Published: 04-01-2026, 9:30 AM
అనిల్ రావిపూడి సవాల్: "నా సినిమాతో అభిమానులను టైం మెషిన్‌లో గిర్రున తిప్పుతా!"
  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘మన శంకర్ వరప్రసాద్’ సంక్రాంతికి విడుదల కానుంది.
  • ‘మన శంకర్ వరప్రసాద్’ 2.5 గంటలు అభిమానులను టైం మెషిన్ ఎక్కించి గిర్రున తిప్పుతానని అనిల్ శపథం చేశారు.
  • చిరంజీవి కెరీర్‌లో నిలిచిపోయేలా సినిమా తీశానని దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించారు.
  • ట్రైలర్‌పై ‘రొట్ట కామెడీ’ అంటూ ట్రోలింగ్ వస్తున్నా, నయనతార హీరోయిన్ కాగా వెంకటేష్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు.

దర్శకుడు అనిల్ రావిపూడి ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాపై అద్భుతమైన ధీమా వ్యక్తం చేశారు. చిరంజీవి అభిమానులను రెండున్నర గంటల పాటు టైం మెషిన్‌లో గిర్రున తిప్పుతానని శపథం చేశారు. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.

అనిల్ రావిపూడి ధీమా: అభిమానులకు టైం మెషిన్ అనుభవం!

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల చేసింది చిత్రం బృందం. ట్రైలర్ లాంచ్ కోసం ప్రత్యేకంగా ఈవెంట్ నిర్వహించి మరి, విడుదల చేశారు. అయితే ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కెరీర్ లో నిలిచిపోయేలా మన శంకర వరప్రసాద్ సినిమా తీసినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు అనిల్.

ఒక గ్యాంగ్ లీడర్, ఆటో జానీ లాంటి సినిమాల్లోని పాత్రలను ఒడిసిపట్టి, చిరంజీవి టైమింగ్ ను పూర్తిగా వాడుకున్నట్లు తెలిపారు. ఈ సినిమా నడిచే రెండున్నర గంటల పాటు, అభిమానులను టైం మిషన్ ఎక్కించి గిర్రున తిప్పుతాను అంటూ శపథం చేశారు అనిల్ రావిపూడి. దీంతో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అయితే తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ పై.. విభిన్న కామెంట్స్ వస్తున్నాయి. రొట్ట కామెడీ ఉందంటూ ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో నయనతార హీరోగా చేస్తుండగా విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నారు. క్లిక్

‘మన శంకర్ వరప్రసాద్’ కథ, చిరంజీవి పాత్ర విశేషాలు

ట్రైలర్‌పై భిన్న స్పందనలు: ట్రోలింగ్ ఎందుకు?

అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ట్రైలర్‌పై మిశ్రమ స్పందనలు వచ్చినా, చిరంజీవి, అనిల్ కాంబినేషన్ ఈ సినిమాను ఎలా నిలబెడుతుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.