
📌 Key Points
- అనిల్ రావిపూడికి ఇప్పటివరకు ఒక్క ప్లాప్ కూడా లేకపోవడం విశేషం.
- ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.
- రామ్ చరణ్ తో సినిమా ఎప్పుడు అంటూ అభిమానులు అనిల్ ను ట్రైలర్ ఈవెంట్ లో అడిగారు.
- ‘మన శంకరవరప్రసాద్ గారు’ బ్లాక్ బస్టర్ అయితేనే చరణ్ సినిమా చేస్తానని అనిల్ షరతు పెట్టారు.
ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, రామ్ చరణ్ తో సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ విజయం సాధిస్తేనే చరణ్ తో సినిమా ఉంటుందని అనిల్ కండీషన్ పెట్టారు. ఈ కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.
అనిల్ రావిపూడి సక్సెస్ ఫార్ములా
రామ్ చరణ్ తో అనిల్ రావిపూడి మూవీ
త్వరలో అంటూ చెప్పిన అనిల్
ముందు మన శంకరవరప్రసాద్ గారు హిట్ అవ్వాలట
చరణ్ అభిమానుల ప్రశ్న.. అనిల్ సమాధానం
Charan- Anil: టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న దర్శకులలో మినిమమ్ గ్యారంటీ దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది అనిల్ రావిపూడి అనే చెప్పాలి. ఆయన ఇప్పటివరకు చేసిన ఒక్క సినిమా కూడా ప్లాప్ అవలేదు అంటే అర్థంచేసుకోవచ్చు ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటి అనేది. కామెడీ అనేది ఆయన స్ట్రెంత్ చేసుకున్నాడు. వరుసగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలను చేస్తూ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో అలరిస్తున్నాడు.
ఇప్పుడు మరోసారి కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అదే మన శంకరవరప్రసాద్ గారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
రామ్ చరణ్ సినిమాకు అనిల్ కండీషన్!
ఈ ట్రైలర్ ఈవెంట్ తిరుపతిలో జరిగింది. ట్రైలర్ కూడా ఎంతెర్తైనింగ్ గా ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ ఈవెంట్ లో అనిల్ రావిపూడి మాట్లాడుతున్న సమయంలో ఫ్యాన్స్ అంతా రామ్ చరణ్(Charan- Anil) తో సినిమా ఎప్పుడు అంటూ అరవడం మొదలుపెట్టారు. దానికి సమాధానంగా అనిల్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ గారు ఒకరోజు ముందు మన శంకరవరప్రసాద్ గారు మూవీ ట్రైలర్ చూశారు.
ఆయనకు బాగా నచ్చింది. నవ్వుకున్నారు కూడా. అయితే, రామ్ చరణ్ తో సినిమా తప్పకుండా చేస్తాను. మీరు మన శంకరవరప్రసాద్ గారు సినిమాను బ్లాక్ బస్టర్ చేయండి. వెంటనే రామ్ చరణ్ దగ్గరకు వెళ్ళిపోతాను”అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో, అనిల్ రావిపూడి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అనిల్ రావిపూడి తన ప్రతి సినిమాపై ఎంత నమ్మకంతో ఉంటారో ఈ వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయి. రామ్ చరణ్ అభిమానులు కూడా ‘మన శంకరవరప్రసాద్ గారు’ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నారు. త్వరలోనే వీరి కాంబో సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.


