|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బిగ్ బ్రేకింగ్: అనిల్ రావిపూడి మాస్ ప్లాన్ లీక్! వెంకీ-కళ్యాణ్ రామ్ లతో డబుల్ ధమాకా!

Published: 04-06-2026, 4:30 PM
బిగ్ బ్రేకింగ్: అనిల్ రావిపూడి మాస్ ప్లాన్ లీక్! వెంకీ-కళ్యాణ్ రామ్ లతో డబుల్ ధమాకా!
  • అనిల్ రావిపూడి కొత్త సినిమా స్క్రిప్ట్ పూజ బాపట్లలో ఘనంగా జరిగింది.
  • విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ లతో భారీ మల్టీస్టారర్.
  • 10-15 రోజుల్లో షూటింగ్ ప్రారంభం, 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్.
  • అనిల్ రావిపూడి స్వగ్రామంలో తల్లిదండ్రుల ఆశీస్సులతో స్క్రిప్ట్ పూజ, సెంటిమెంట్ ప్లాన్.

టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్లకి కేరాఫ్ అడ్రస్ అనిల్ రావిపూడి. ఫ్లాప్ ఎరుగని దర్శకుడు ఇప్పుడు మరో సంచలనానికి సిద్ధమయ్యాడు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ లతో కలిసి డబుల్ ధమాకా ఇవ్వడానికి భారీ ప్లాన్ తో వస్తున్నాడు. ఈ వార్త ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతోంది!

అనిల్ రావిపూడి నో-ఫ్లాప్ స్ట్రీక్ కొనసాగుతుందా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు ఉన్నారు. కానీ ఇందులో కొంత మంది మాత్రమే సక్సెస్ అందుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్నారు. అలాంటి వారిలో అనిల్ రావిపూడి ఒకరు. పటాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి… ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ లేకుండా ముందుకు దూసుకు వెళ్తున్నాడు. ఒక్కసారైనా దొరుకుతాడు అనుకుంటే..ఎవ‌రికీ చిక్క‌కుండా స‌క్సెస్ తో దూసుకు వెళ్తున్నాడు. మొన్న సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి హిట్ కొట్టిన అనిల్ రావిపూడి, ఇప్పుడు మరో సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఈ మేరకు స్క్రిప్ట్ సిద్ధం చేశారు. గురువారం రోజున ఆయన స్వగ్రామం బాపట్ల చిలుకూరి వారి పాలెం లోని ఆంజనేయ స్వామి సన్నిధిలో స్క్రిప్ట్ కు పూజలు కూడా చేయించారు.

ఆ తర్వాత తల్లిదండ్రులు బ్రహ్మయ్య, అనంతలక్ష్మి చేతుల మీదుగా ఆ స్క్రిప్ట్ అందుకున్నారు అనిల్ రావిపూడి. ఈ సందర్భంగా గ్రామంలో సందడి వాతావరణం చోటు చేసుకుంది. విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ లతో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు అనిల్ రావిపూడి. ఈ ఇద్దరు హీరోలతో గతంలో వేరు వేరుగా సినిమాలు చేశారు కానీ ఈ సారి మాత్రం ఇద్దరిని కలిపి, ఓ ఫ్యామిలీ ఎంటర్ టైన‌ర్ తీసేందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా మరో 10-15 రోజుల్లో షూటింగ్ కూడా ప్రారంభించుకొని ఉన్నట్లు టాక్ నడుస్తోంది. 2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట అనిల్. ఈ మేరకు షూటింగ్ ఫినిష్ చేసి, అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని సిద్ధమవుతున్నారట.

వెంకీ-కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ విశేషాలు

సరికొత్త ఫ్యామిలీ ఎంటర్‌టైనర్: రిలీజ్ డేట్ ఫిక్స్!

అనిల్ రావిపూడి కొత్త సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో రాబోయే ఈ చిత్రం టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ కోసం వేచి చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.