
Key Points
సూపర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అమ్మ టీవీ షోలో!
మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్‌లో అనంత లక్ష్మి రావిపూడి సందడి
అనిల్ రావిపూడి తల్లి తన కొడుకు విజయంపై ఎమోషనల్ అయ్యారు
ప్రోమో వైరల్‌గా మారింది
అనిల్ రావిపూడి అమ్మ టీవీలో!
Anil Ravipudi : చేసిన ప్రతి సినిమాతో హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్ అయ్యాడు అనిల్ రావిపూడి. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయం సాధించి రీజనల్ సినిమాతోనే 300 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి చిరంజీవితో సినిమా చేస్తున్నాడు. మరో పక్క అనిల్ రావిపూడి టీవీ షోలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.
జీ తెలుగు డ్రామా జూనియర్స్ షోలో అనిల్ రావిపూడి, రోజా జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మదర్స్ డే సందర్భంగా స్పెషల్ ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేసారు. ఈ ఎపిసోడ్ లోఅనిల్ రావిపూడి వాళ్ళ అమ్మ అనంత లక్ష్మి రావిపూడి వచ్చి సందడి చేసారు. తన కొడుకు సక్సెస్ అయినందుకు ఎమోషనల్ అయ్యాను అన్నారు. సుధీర్ మీద ఓ రెండు కామెడీ పంచులు కూడా వేశారు.


