
📌 Key Points
- 22 ఏళ్లకే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనీత్ పద్ద!
- మొదటి సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ బ్యూటీ సంచలనం!
- సయ్యారా మూవీతో ప్రపంచవ్యాప్తంగా 570 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఘనత.
- బాలీవుడ్ లో అనీత్ పద్దకు విపరీతమైన క్రేజ్!
22 ఏళ్లకే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఒక బ్యూటీ.. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆమె ఎవరో కాదు.. అనీత్ పద్ద. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం!
ఫస్ట్ మూవీతోనే రికార్డులు క్రియేట్ చేసిన అనీత్ పద్ద
సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి ఎన్నో సినిమాల్లో నటించినా రాని క్రేజ్, కొంతమంది బ్యూటీలకు మాత్రం ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ లో వచ్చేస్తూ ఉంటుంది. అలా ఒక్క సినిమాతో అదిరిపోయే రేంజ్ క్రేజ్ రావాలంటే, కచ్చితంగా ఆ సినిమా సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుని ఉండాలి, లేదంటే అందులో ఆ నటి మంచి నటననైనా కనబరిచి ఉండాలి. అలా చేసిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని, ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ క్రేజ్ను సంపాదించుకున్న బ్యూటీలలో అనీత్ పద్ద ఒకరు.
సయ్యారా మూవీ కలెక్షన్ల సునామీ!
ఈమె పోయిన సంవత్సరం విడుదల అయిన సయ్యారా చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది. ఈ బాలీవుడ్ చిత్రం పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయింది. కానీ రిలీజ్ అయిన తర్వాత మాత్రం అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ఈ మూవీ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 570 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి, పోయిన సంవత్సరం హిందీ సినీ పరిశ్రమలో భారీ విజయాన్ని అందుకున్న సినిమాల లిస్టులో చేరిపోయింది. ఈ చిత్రం పోయిన సంవత్సరం జూలై 18వ తేదీన విడుదల అయింది.
బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా అనీత్
ఈ చిత్రం విడుదల అయిన సమయానికి ఈ ముద్దుగుమ్మ వయస్సు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. 22 సంవత్సరాల వయస్సులోనే ఈమెకు అద్భుతమైన విజయం దక్కడంతో ఓవర్ నైట్ లో ఈమెకు స్టార్ హీరోయిన్ క్రేజ్ వచ్చింది. అలాగే ఈ సినిమా చూసిన వారంతా కూడా ఇందులో అనీత్ పద్ద నటన అద్భుతంగా ఉందని, ఈ బ్యూటీకి చాలా మంచి ఫ్యూచర్ ఉందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈమె ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా గుర్తింపును సంపాదించుకుంది.
మొదటి సినిమాతోనే అనీత్ పద్ద బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆమె రాబోయే ప్రాజెక్టుల కోసం ఎదురు చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


