
‘కచ్చా బాదామ్’ పాటతో పేరు తెచ్చుకున్న అంజలి అరోరా తాజాగా ఓ పబ్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో నెటిజన్లను విభిన్నంగా స్పందించేలా చేసింది. సినిమా అవకాశాలు తగ్గడంతోనే ఇలా చేస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Key Points
'కచ్చా బాదామ్' ఫేమ్ అంజలి అరోరా తాజా వీడియో వైరల్‌గా మారింది.
థాయ్‌లాండ్ పబ్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట చర్చనీయాంశం.
సినిమా అవకాశాలు తగ్గడంతో పబ్ డ్యాన్స్‌లు చేస్తోందని నెటిజన్ల అభిప్రాయం.
గతంలో ఎంఎంఎస్ లీక్, వీడియో లీక్ వివాదాలతో వార్తల్లో నిలిచింది.
కచ్చా బాదామ్ అమ్మాయి తాజా వీడియో
‘కచ్చా బాదామ్’ సాంగ్ తో అప్పట్లో ఫేమస్ అయిన నటి అంజలి అరోరా . ఆ తర్వాత పలు రియాలిటీ షోలు, సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది . అంతేకాకుండా సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది . బాలీవుడ్ లో ది లవ్ ఈజ్ ఫరెవర్ , దివాళియాన్ , డెలియాన్ చిత్రాల్లో నటించింది . అయితే తాజాగా ఆమె పార్టీలో డ్యాన్స్ చేస్తూ కనిపించింది . ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు . సినిమాల్లో నటించిన అంజలి అరోరా పబ్ డ్యాన్స్ లు చేయడమేంటని నోరెళ్లబెడుతున్నారు .
తాజాగా అంజలి అరోరా థాయ్ లాండ్ లోని ఓ పబ్ లో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఇది చూసిన నెటిజన్స్ సినిమా అవకాశాలు తగ్గడంతో ఇలా డ్యాన్స్ ప్రదర్శనలు చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరేమో గౌరవంగా బతకడం కోసం తన వృత్తిని కొనసాగిస్తోందని మద్దతుగా పోస్టులు పెడుతున్నారు . కాగా … అంజలి అరోరా ఇటీవల ఎంఎంఎస్ లీక్, వీడియో లీక్ వంటి వివాదాలతో మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ పబ్లిసిటీతో ఆమె కోట్లలో డబ్బు సంపాదించిందని కూడా ఆరోపణలొచ్చాయి . ఒకప్పుడు స్టార్ గా ఉన్న అంజలి ఇప్పుడు పట్టాయాలో క్లబ్ డ్యాన్సర్ గా మారిపోవడంతో ఆమె ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు .
నెటిజన్ల విమర్శలు, మద్దతు
అంజలి అరోరా గత వివాదాలు
అంజలి అరోరా తన వృత్తిపరమైన జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్ళు, ఆమె జీవితంలోని వివాదాలు ఈ వార్తతో మళ్ళీ చర్చనీయాంశమయ్యాయి. ఆమె భవిష్యత్తు కెరీర్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.


