|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Anjali Pavan: బుల్లితెర నటి అంజలి ఇంట తీవ్ర విషాదం

Published: 02-08-2025, 3:45 AM
Anjali Pavan: బుల్లితెర నటి అంజలి ఇంట తీవ్ర విషాదం

ప్రముఖ బుల్లితెర నటి అంజలి పవన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషాద ఘటనపై అంజలి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తన విచారాన్ని వ్యక్తం చేసింది.

Key Points

1

బుల్లితెర నటి అంజలి పవన్ తల్లి కన్నుమూశారు.

2

అంజలి సోషల్ మీడియాలో తన విషాదాన్ని పంచుకుంది.

4

అంజలి ప్రస్తుతం రెండో గర్భంతో ఉంది.

అంజలి తల్లి మరణం

బుల్లితెర నటి అంజలి పవన్‌ (Anjali Pavan) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. దీంతో నటి శోకసంద్రంలో మునిగిపోయింది. అమ్మ చనిపోయిన విషయాన్ని అంజలి.. సోషల్‌ మీడియాలో వెల్లడిస్తూ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. అమ్మా, నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేనిది. నువ్వు ఇచ్చిన ప్రేమ, నీ చిరునవ్వు, నీ మాటలు.. ఇవన్నీ ఇప్పుడు జ్ఞాపకాలలోనే మిగిలిపోయాయి. కాలం నిన్ను మా నుంచి దూరం చేసినా.. మా హృదయం నిన్ను ఎప్పటికీ దూరం చేయలేదు.

నమ్మలేకపోతున్నాం.. నీ ఆశీస్సుల వెలుగు ఎల్లప్పుడూ మా జీవితాలకు దారి చూపిస్తుంది. అమ్మ ఆత్మకు శాంతి కలగాలి అని క్యాప్షన్‌ ఇచ్చింది. ఇది చూసిన ఇతర నటీనటులు.. అయ్యో, నమ్మలేకపోతున్నాం.. ఓం శాంతి అంటూ కామెంట్లు చేస్తున్నారు. మళ్లీ మీ అమ్మగారు మీ కడుపున పుడతారు, నువ్వు ధైర్యంగా ఉండు అంటూ అభిమానులు నటిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.

సోషల్ మీడియా పోస్ట్

రెండో ‍ప్రెగ్నెన్సీ.. మొగలిరేకులు సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న అంజలి ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటోంది. 2017లో నటుడు సంతోష్‌ పవన్‌ను పెళ్లి చేసుకోగా వీరికి చందమామ అనే కూతురు ఉంది. ఇటీవలే రెండోసారి గర్భం దాల్చగా.. జూన్‌లో అంజలికి ఘనంగా సీమంతం కూడా చేశారు. త్వరలోనే మరో బుజ్జాయి ఇంట్లో అడుగుపెట్టనుందని సంతోషిస్తుండగా.. అంతలోనే అమ్మ మరణించడంతో నటి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. అంజలి.. రాధా కల్యాణం, దేవత వంటి సీరియల్స్‌తో పాటు లెజెండ్‌, ఒక లైలా చిత్రాల్లో నటించింది.

అంజలి వృత్తి జీవితం

అంజలి తల్లి మరణంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే, అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు ధైర్యం చెప్పి ఓదార్చుతున్నారు. అంజలి త్వరగా ఈ దుఃఖం నుండి బయటపడాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.