
బుల్లితెర నటి అంజలి, పవన్ దంపతులకు త్వరలో రెండో బిడ్డ రానున్న సందర్భంగా సీమంతోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుక ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Key Points
బుల్లితెర నటి అంజలికి రెండో సంతానం.
ఘనంగా జరిగిన సీమంతోత్సవం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు.
నెటిజన్ల నుండి అంజలి, పవన్ దంపతులకు శుభాకాంక్షలు.
అంజలి సీమంతోత్సవం వైభవం
బుల్లితెర నటి అంజలి(Anjali)కి పరిచయం అక్కర్లేదు. ఆమె పలు సీరియల్స్‌లో హీరోయిన్‌గా నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. మరీ ముఖ్యంగా ‘మొగలిరేకులు’ సీరియల్‌తో అంజలి రేంజ్ మారిపోయింది. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ప్రేక్షకుల్లో తన పాపులారిటీని పెంచుకుంతి. ఈక్రమంలోనే పవన్(Pavan)ను పెళ్లాడిన ఆమెకు చందమామ(chandamama) (దాన్విక షాష) అనే పాప కూడా ఉంది. ఇక అప్పటినుంచి ఈ జంట ఓ యూట్యూబ్ చానల్ నడుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు.
సోషల్ మీడియాలో వైరల్
పలు ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా ఫ్యామిలీ మొత్తం పలు బుల్లితెర షోస్‌లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇటీవల ఫాదర్స్ డే స్పెషల్ ప్రోగ్రాం లోనూ కూతురితో పాల్గొన్నారు. ఇక అంజలి ఇటీవల రెండోసారి ప్రెగ్నెంట్ అయినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, అంజలి సీమంతం వీడియోను షేర్ చేసింది. దీనికి ‘‘మా జ్ఞాపకాలను సంగ్రహించి, రీల్ అవుట్‌పుట్‌ను క్షణాల్లో అందించినందుకు ఫ్లాష్‌షూట్‌కి ధన్యవాదాలు.
నెటిజన్ల శుభాకాంక్షలు
ఫ్లాష్‌షూట్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి రీల్ తయారీ యాప్. వారు మీ ఏవైనా సందర్భాలలో, ఒకేసారి షూట్ చేసి రీల్స్‌ను తయారు చేస్తారు. iPhoneలో చిత్రీకరించి గంటల్లో డెలివరీ చేస్తారు’’ అని రాసుకొచ్చింది. అయితే ఘనంగా ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ వేడుకకు పలువురు బుల్లితెర నటీనటులు హాజరై సందడి చేశారు. ఇక ఈ జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వాటిని చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.
అంజలి మరియు పవన్ దంపతులకు నెటిజన్ల నుండి అపారమైన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంతోషకరమైన సందర్భంలో వారికి మన హృదయపూర్వక శుభాకాంక్షలు.


