|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: అంజి సినిమాకు మొదట ఈ డైరెక్టరా? అసలు నిజం తెలుసా?

Published: 02-03-2026, 9:35 PM
షాకింగ్: అంజి సినిమాకు మొదట ఈ డైరెక్టరా? అసలు నిజం తెలుసా?
  • అంజి సినిమాకు మొదట దర్శకుడు సభాపతి, ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు.
  • సభాపతి తీసిన విజువల్స్ నచ్చకపోవడంతో కోడి రామకృష్ణకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు నిర్మాతలు.
  • టబు హీరోయిన్ గా అనుకున్నా, ఆ తరువాత నమ్రతా శిరోద్కర్ ను హీరోయిన్ గా తీసుకున్నారు.
  • అంజి సినిమా కోసం సభాపతి తీసిన ఫుటేజీని రీషూట్ చేద్దామనుకున్నారు, కానీ బడ్జెట్ దృష్ట్యా వదులుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అంజి సినిమా ఒక ప్రత్యేకమైన చిత్రం. ఈ సినిమా గురించి ఎన్నో విషయాలు ఇప్పటికీ ఎవరికీ తెలియవు. అసలు ఈ సినిమాకు మొదట ఎవరు డైరెక్టర్? ఎందుకు మార్చారు? తెలుసుకోండి!

అంజి సినిమా ఫస్ట్ డైరెక్టర్ ఎవరు?

Anji Movie : మెగాస్టార్ కెరీర్లో ఎక్కువ కాలం సాగిన సినిమా అంజినే. రకరకాల కారణాలతో దాదాపు 5 ఏళ్ళు ఈ సినిమాని సాగదీశారు. సినిమా బాగున్నా అప్పుడు కమర్షియల్ గా ఆడలేదు. అదే క్లైమాక్స్, అదే గ్రాఫిక్స్ తో ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే ఆ సినిమా పాన్ ఇండియా హిట్ అయ్యేది.

అంజి సినిమాని శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాణంలో కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసారని అందరికి తెలిసిందే. అయితే అంజి సినిమాకు మొదట కోడి రామకృష్ణ డైరెక్టర్ కాదు. అంజి సినిమా షూటింగ్ తమిళ దర్శకుడు సభాపతితో మొదలుపెట్టారు.

డైరెక్టర్ మార్పుకు కారణం ఏమిటి?

సభాపతి తమిళ్ లో ఓ పది సినిమాలు తీశారు దర్శకుడిగా. తెలుగులో జగపతి బాబుతో పందెం సినిమా తీశారు. ఆయనతో అంజి సినిమా మొదలుపెట్టారు కానీ కొంత భాగం షూటింగ్ అయ్యాక సభాపతి తీసిన విజువల్స్ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డికి నచ్చలేదు. దీంతో తనతో రెగ్యులర్ గా సినిమాలు చేసిన డైరెక్టర్ కోడి రామకృష్ణ కు అంజి సినిమా బాధ్యతని అప్పగించారు.

స్క్రిప్ట్ ఏం మార్చలేదు కానీ ఆల్రెడీ షూటింగ్ అయిన దాంట్లో కేవలం పనికొచ్చేది మాత్రమే తీసుకున్నారు. ఒకానొక దశలో సభాపతి తీసిన ఫుటేజీని పక్కనపారేసి మళ్ళీ రీ షూట్ చేద్దామనుకున్నారు కానీ కోట్లు వృథా అవుతాయని, అప్పటికే బడ్జెట్ పెరిగిపోతుందని పనికొచ్చేవి తీసుకున్నారు. డైరెక్టర్ సభాపతి 2024 లో మరణించారు.

హీరోయిన్ మార్పు వెనుక అసలు కథ

అలాగే అంజి సినిమాకు మొదట టబుని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ తర్వాత నమ్రతా శిరోద్కర్ ని తీసుకున్నారు.

అంజి సినిమా గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు ఎలా అనిపించాయి? మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. మెగాస్టార్ విశేషాలు ఎప్పటికప్పుడు అందిస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.