
📌 Key Points
- కార్తీ హీరోగా వచ్చిన ‘వా వాతియార్’ మూవీ తెలుగులో ‘అన్నగారు వస్తారు’గా విడుదల!
- ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయింది, కానీ ప్లాప్ టాక్!
- అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైన ఈ సినిమాపై ఎన్టీఆర్ రీప్లేస్మెంట్ విషయంలో విమర్శలు!
- ఎంజిఆర్ ప్లేస్‌లో ఎన్టీఆర్‌ను రీప్లేస్ చేస్తూ కొత్త వెర్షన్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్!
తెలుగు సినీ అభిమానులకు ఒక సంచలన వార్త! ‘అన్నగారు వస్తారు’ సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ మార్పు సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ తెస్తుందో చూడాలి. అభిమానుల్లో మాత్రం అప్పుడే ఉత్సాహం నెలకొంది.
అన్నగారు వస్తారు మూవీ రిలీజ్ అప్డేట్స్
Annagaru Vostharu OTT: తమిళ స్టార్ కార్తీ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘వా వాతియార్’. తెలుగులో ఈ సినిమాను అన్నగారు వస్తారు పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాను దర్శకుడు నలన్ కుమారస్వామి తెరకెక్కించగా ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించించింది. పలు వాయిదాల కారణంగా ఈ సినిమా అనుకోకుండా సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యింది. అయితే, ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ప్లాప్ టాక్ వచ్చింది.
ఓటీటీలో ఎన్టీఆర్ రీప్లేస్మెంట్ వివాదం
కథ, కథనాలు మరీ ఫేలవంగా ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. తెలుగులోనే కాదు తమిళనాట కూడా ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. అనంతరం అన్నగారు వస్తారు(Annagaru Vostharu OTT) సినిమాను అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల చేశారు. తెలుగులో ఈ సినిమా ఓటీటీ వెర్షన్ పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఈ సినిమా తమిళ వెర్షన్ లో సీనియర్ హీరో ఎంజిఆర్ రెఫెరెన్స్ ఉంటుంది.
కొత్త వెర్షన్ విడుదలకి ప్లాన్ చేస్తున్న మేకర్స్
ఆయన ప్లేస్ లో తెలుగు వెర్షన్ లో ఎన్టీఆర్ ని చూపించారు. కానీ, ఓటీటీలో మాత్రం మార్చలేదు. దాంతో, ఈ విషయంలో అన్నగారు వస్తారు సినిమాపై విమర్శలు తలెత్తాయి. కానీ, ఇప్పుడు కొత్త వెర్షన్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ వెర్షన్ లో ఎంజిఆర్ ప్లేస్ లో ఎన్టీఆర్ ని రీప్లేస్ చేశారట. కనీసం ఈ మార్పులు చేశాకనైనా మంచి రరెస్పాన్స్ వస్తుందా అని ఆలోచిస్తున్నారు మేకర్స్. అయితే, ఈమార్పులు ముందే చేసి ఉంటే మంచి రెస్పాన్స్ వచ్చేది అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. త్వరలోనే ఈ కొత్త వెర్షన్ విడుదలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
అన్నగారు వస్తారు సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా కొత్త వెర్షన్ విడుదల కోసం ఎదురుచూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


