|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘ఆర్ఎక్స్ 100’, ‘బేబి’లా మరో చిత్రం..

Published: 29-10-2025, 1:31 PM
‘ఆర్ఎక్స్ 100’, ‘బేబి’లా మరో చిత్రం..

‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం నవంబర్ 21న విడుదల కానుంది. ఈటీవీ విన్ ఒరిజినల్స్‌ నిర్మించిన ఈ సినిమాపై నిర్మాత బన్నీ వాస్ ప్రశంసల వర్షం కురిపించారు. అఖిల్, తేజస్విని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఒక భావోద్వేగ కథగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన అన్నారు.

Key Points

1

అఖిల్, తేజస్విని జంటగా నటించిన 'రాజు వెడ్స్ రాంబాయి' నవంబర్ 21న విడుదల.

2

ఈటీవీ విన్ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి ఈ చిత్రాన్ని నిర్మించారు.

4

అఖిల్, తేజస్విని, సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు చైతన్యల నటన అభినందనీయం.

‘రాజు వెడ్స్ రాంబాయి’ విడుదల వివరాలు

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’(Raju Weds Rambai). డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్‌టర్న్ ఫిలింస్, మాన్‌సూన్స్‌టేల్స్ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల(Venu Udugula), రాహుల్ మోపిదేవి (Rahul Mopidevi) నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. సాయిలు కంపాటి (Sailu kampati)దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 21న ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాను వంశీ నందిపాటి ఎంటర్‌టైన్మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్‌పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్ ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. ‘రాజు వెడ్స్ రాంబాయి సినిమా చూశాను. ఇది నా మనసుకు హత్తుకుంది. కొందరి లైఫ్‌లో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా చేశారు. ఇది కాల్పనిక కథ అయితే మనం ఆ దర్శకుడి ఊహకు ఆశ్చర్యపోయేవాళ్లం. ఇలా ఎలా ఆలోంచించారు అనుకునేవాళ్లం. ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులు ఒక ఎమోషనల్ ఫీల్‌తో వస్తారు. అఖిల్ రాజు పాత్రలో బాగా నటించాడు. తేజస్విని తెలుగు అమ్మాయి. ఈ సినిమాలో తన స్క్రీన్ ప్రెజెన్స్, పర్ ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. హీరో సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) బ్రదర్ చైతన్య ఒక మంచి రోల్ చేశాడు. అతనికి నటుడిగా మంచి పేరు తెచ్చే మూవీ అవుతుంది. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఆయనతో పాటు ఈటీవీ విన్ వారికి మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.

బన్నీ వాస్ ప్రశంసలు: ఒక ఎమోషనల్ కథ

నటీనటుల ప్రదర్శనపై సమీక్ష

నవంబర్ 21న విడుదల కానున్న “రాజు వెడ్స్ రాంబాయి” చిత్రం ప్రేక్షకులను భావోద్వేగ ప్రయాణంలోకి తీసుకెళ్తుందని బన్నీ వాస్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈటీవీ విన్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.