
సినిమా రంగంలో మరో స్టార్ కిడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. ప్రముఖ సంగీత దర్శకుడు విద్యాసాగర్ తనయుడు హర్షవర్ధన్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించనుండగా, ఇది రోడ్ ట్రావెల్ యాక్షన్ కథగా రూపొందనుంది.
Key Points
ప్రముఖ సంగీత దర్శకుడు విద్యాసాగర్ తనయుడు హర్షవర్ధన్ హీరోగా పరిచయం కాబోతున్నాడు.
రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా ఎంపిక కానుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.
లింగస్వామి దర్శకత్వంలో రోడ్ ట్రావెలింగ్ ఇతివృత్తంతో కూడిన యాక్షన్ కథగా ఈ చిత్రం రూపొందనుంది.
మదరాసీ, కాంతార:చాప్టర్1 విజయాల తర్వాత రుక్మిణికి ఇది మరో మంచి అవకాశం.
విద్యాసాగర్ తనయుడు హర్షవర్ధన్ సినీ రంగ ప్రవేశం
సినీ ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ హవా నడుస్తోంది. ప్రముఖుల వారసులు హీరోలుగా, హీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయం అవుతూ సత్తా చాటుతున్నారు. తల్లిదండ్రుల లెగసీని కాపాడుకోవడంతో పాటు తమ టాలెంట్‌ను బయటపెడుతూ ప్రశంసలు పొందుతున్న వారెందరో. ఇక ఇప్పుడు మరో వారసుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం ప్రముఖ సంగీత దర్శకుడు విద్యాసాగర్ తనయుడు హర్షవర్ధన్ (Harshavardhan)హీరోగా పరిచయం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు, హిందీ, మలయాళ, హిందీ భాషల్లో అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించి పేరు సంపాదించుకున్న విద్యాసాగర్.. ఇప్పటికీ పలు ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు హర్షవర్ధన్ కూడా సంగీతాన్ని నేర్చుకుని సంగీత కచేరిలో పాల్గొంటూ గుర్తింపు తెచ్చుకుని.. నటనపై ఆసక్తితో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ఇక ఈ చిత్రానికి లింగస్వామి(Lingaswamy) దర్శకత్వం వహిస్తున్నట్లు టాక్. ఇది రోడ్డు ట్రావెలింగ్ ఇతివృత్తంతో సాగే యాక్షన్‌తో కూడిన కథ అని తెలుస్తోంది. ఇక ఇందులో హర్షవర్ధన్ సరసన రుక్మిణి వసంత్(Rukmini Vasanth)ను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల మదరాసీ, కాంతార:చాప్టర్1 సినిమాలతో వరుస హిట్స్ సాధించిన రుక్మిణి అయితే బాగా సెట్ అవుతుందని భావించి ఆమెకి కథ చెప్పగా.. నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్‌లోనూ పాల్గొనబోతుందట. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న వారంతా అమ్మడు లక్కీ చాన్స్ కొట్టేసిందని అంటున్నారు.
హీరోయిన్‌గా రుక్మిణి వసంత్‌ను పరిశీలిస్తున్న నిర్మాతలు
రోడ్ ట్రావెలింగ్ యాక్షన్ కథతో రాబోతున్న చిత్రం
వారసుడు హర్షవర్ధన్ హీరోగా, క్రేజీ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ కాంబినేషన్ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.


