|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘స్పిరిట్’లో మరో హీరో ఎంట్రీ? వంగా సార్ ఇచ్చిన హింట్ మామూలుగా లేదుగా! ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే!!

Published: 30-01-2026, 10:05 PM
‘స్పిరిట్’లో మరో హీరో ఎంట్రీ? వంగా సార్ ఇచ్చిన హింట్ మామూలుగా లేదుగా! ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే!!
  • సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
  • విజయ్ దేవరకొండ ఫొటోను షేర్ చేసిన వంగా.. ‘స్పిరిట్’లో నటిస్తున్నాడా అనే చర్చలు మొదలు.
  • గోపీచంద్ విలన్‌గా.. చిరంజీవి కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని టాక్.
  • ప్రభాస్, త్రిప్తి డిమ్రి జంటగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

టాలీవుడ్ సెన్సేషన్ సందీప్ రెడ్డి వంగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలిసి ‘స్పిరిట్’ మూవీతో రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా వస్తున్న వార్తలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇంతకీ ఆ వార్తలేంటో చూద్దాం!

వంగా పోస్ట్ వెనుక అసలు రహస్యం ఏంటి?

టాలీవుడ్‌లో తక్కువ సినిమాలతోనే భారీ సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga). ఇప్పటివరకు కేవలం రెండు సినిమాలే తెరకెక్కించినప్పటికీ.. ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’తో ట్రెండ్ సెట్ చేసిన వంగా.. ఆ మూవీ విజయ్ దేవరకొండ కెరీర్‌ను ఓ మలుపు తిప్పింది. ఆ తర్వాత తెరకెక్కిన ‘యానిమల్’ అయితే బాక్సాఫీస్ వద్ద తుఫాన్ సృష్టించి.. రికార్డుల్ని తిరగరాసింది. ఈ రెండు బ్లాక్‌బస్టర్లతో సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా దర్శకుడిగా ఎదిగారు. ఈ క్రమంలోనే ఆయనకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సినిమా చేసే బంపర్ ఛాన్స్ దక్కింది. ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘స్పిరిట్’ (Spirit)ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas)సరసన త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, వినయ్ ఒబెరాయ్, డాన్ లీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రభాస్‌తో గోపీచంద్ ఢీ అంటే మామూలుగా ఉండదు!

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్‌లో జరుగుతోంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్‌ను ఢీ కొట్టడం కోసం గోపీచంద్ విలన్ పాత్రలో నటిస్తున్నాడన్న టాక్ ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది. ఈక్రమంలో.. తాజాగా.. ఈ చర్చలకు మరింత బలం చేకూరేలా సందీప్ రెడ్డి వంగా చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘అర్జున్ రెడ్డి’ షూటింగ్ సమయంలో తీసిన విజయ్ దేవరకొండ ఫొటోను వంగా షేర్ చేయడం గమనార్హం. దానికి ఎలాంటి క్యాప్షన్ ఇవ్వకపోవడంతో.. ‘స్పిరిట్’ సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడన్న హింట్ ఇదేనా? అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అనుకోకుండా ఇలా విజయ్ ఫొటోను షేర్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, గోపీచంద్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

చిరు కూడా స్పిరిట్‌లో భాగమేనా? మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే!

A post shared by Sandeep Reddy Vanga (@sandeepreddy.vanga)

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘స్పిరిట్’ మూవీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.