|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఏఎన్నార్‌ ఆగ్రహం! స్టార్‌ హీరోయిన్‌కు చుక్కలు చూపిన నటసమ్రాట్‌!

Published: 18-06-2026, 4:00 AM
ఏఎన్నార్‌ ఆగ్రహం! స్టార్‌ హీరోయిన్‌కు చుక్కలు చూపిన నటసమ్రాట్‌!
  • ఏఎన్నార్‌ రొమాంటిక్ హీరో అయినా, ఆయన బోల్డ్‌ స్వభావం గురించి సీనియర్ హీరోయిన్లు వెల్లడి.
  • అక్కినేని స్టార్ హీరోయిన్‌ కృష్ణవేణిని ఇంటికి పిలిపించి ఆడుకున్న సంచలన సంఘటన.
  • “కమ్మ కులంలో పుట్టి సిగ్గులేదా?” అంటూ ఏఎన్నార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షాకింగ్ నిజం.
  • ఏఎన్నార్‌ తిట్లతో కృష్ణవేణి కారు డోర్ తన్ని, ఏడుస్తూ వెళ్లిపోయిన వైరల్ టాక్.

నటసమ్రాట్, రొమాంటిక్ హీరో ఏఎన్నార్‌ గురించి ఎవరికి తెలియదు? ఆయనలోని మరో కోణం ఇప్పుడు బయటపడిన నిజాలు సినీ అభిమానులను షాక్‌కు గురిచేస్తున్నాయి. ఓ స్టార్ హీరోయిన్‌ను ఏఎన్నార్‌ ఎందుకు అంతలా తిట్టాల్సి వచ్చింది? తెలుసుకుందామా!

ఏఎన్నార్‌ అసలైన మన్మథుడా?

ఏఎన్నార్‌.. మంచి రొమాంటిక్ చిత్రాలతో ఆకట్టుకున్నారు. `దేవదాసు` వంటి అనేక ప్రేమ కథా చిత్రాలతో   అలరించారు. మోస్ట్ రొమాంటిక్‌ హీరోగానూ పేరుతెచ్చుకున్నారు. అయితే మన్మథుడు అంటే నాగార్జున పేరే చెబుతారు. కానీ అసలైన మన్మథుడు తాతగారు అని హీరో సుమంత్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. చాలా మంది హీరోయిన్లు కూడా ఏఎన్నార్‌ గురించి ఇదే చెప్పారు, ఆయన బోల్డ్ గా ఉంటారని, హీరోయిన్లని ఆటపట్టిస్తుంటాడని, సరదాగా సరసం ఆడుతుంటాడని పలువురు సీనియర్‌ హీరోయిన్లు తెలిపారు. ఆయన ఏజ్ 60 అయినా ఇరవై లాగే మనసు ఉంటుందన్నారు.

ఈ క్రమంలో ఓ స్టార్‌ హీరోయిన్‌ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడట ఏఎన్నార్‌. హీరోయిన్‌ కావాలని వస్తే, ఒక రేంజ్ లో ఆడుకున్నాడట. దెబ్బకి ఆమె ఏడుస్తూ వెళ్లిపోయిందట. పోతూ పోతూ ఏఎన్నార్‌ కార్‌ డోర్‌ని తన్ని వెళ్లిపోయిందట. ఇది చూసిన అక్కినేని షాక్‌ అయ్యాడట. మరి ఆ కథేంటి? ఆ హీరోయిన్‌ ఎవరనేది చూస్తే, ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది క్రిష్ణవేణి. 1979లో `నగ్న సత్యం` అనే చిత్రంతో ఆమె హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యింది. దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్‌లో హీరోయిన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా చేసింది. ప్రారంభంలో హీరోయిన్‌గా చేసి మెప్పించింది. స్టార్‌గా రాణించింది.

కృష్ణవేణికి ఏఎన్నార్‌ షాక్!

సినిమాల్లోకి వచ్చిన ప్రారంభంలో కృష్ణవేణి మొదటి సినిమా చేసింది. ఆ తర్వాత అవకాశాల కోసం చూస్తున్నప్పుడు. ఏఎన్నార్‌ కొత్తగా ఒక సినిమా చేస్తున్నాడట. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్‌ జరుగుతుందట. వెళ్లి కలిసి రా అని చెప్పి కృష్ణవేణికి కారు ఇచ్చి పంపించాడట వాళ్ల మామయ్య. ఆయన ఏఎన్నార్‌కి చాలా క్లోజ్‌. దీంతో కారులో స్టూడియోకి వెళ్తున్నప్పుడు అప్పుడే అక్కినేని ఓపెన్‌ టాప్‌ కారులో ఇంటికెళ్తుందట. ఆయన్ని చూసి, ఇదిగో మా మామయ్య మిమ్మల్ని ఒకసారి కలిసి రమ్మన్నారని గట్టిగా అరిచిందట. అది విన్న ఏఎన్నార్‌.. ఒక్క చూపు చూసి సరే రా అన్నాడట.

ఆమెని తన కారులో ఎక్కించుకొని ఇంటి వరకు తీసుకెళ్లాడట. వెనకాల కృష్ణవేణి వాళ్ల కారు వస్తుంది. ఇంటికెళ్లే లోపు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడట అక్కినేని. కమ్మకులంలో పుట్టి సిగ్గులేదా, అమ్మకి బాబుకి చెప్పి వచ్చావా? పారిపోయి వచ్చావా? సినిమాల్లోకి రావాలని నీకు ఎలా అనిపించింది? అంటూ గ్యాప్‌ లేకుండా తిడుతూనే ఉన్నాడట. దాన్ని కృష్ణవేణి తట్టుకోలేకపోయిందట. ఇక అక్కినేని ఇళ్లు వచ్చింది. రాగానే.. ఇక దిగు నిన్ను ఇలా చూస్తే, మా ఆవిడ నాకు తిండి కూడా పెట్టదు అన్నాడట. ఆ దెబ్బకి కారు దిగిన కృష్ణవేణి.. అక్కినేని కారు డోర్‌ని ఒక్క తన్ను తన్ని వెళ్లి తన కారులో కూర్చుందట. ఆమె ఇంటికి వెళ్లే లోపు.. అక్కినేని వాళ్ల మామయ్యకి ఫోన్‌ చేసి కృష్ణవేణి ప్రవర్తన గురించి చెప్పాడట. బాగా తిట్టాడట.   అక్కినేనికి మాటల్లో ప్రేమ అలా వస్తుందని, మనసులో ఆయనకు ఏం ఉండదని తెలిపింది కృష్ణవేణి.

ఆ తిట్టు వెనుక అసలు కథ ఏంటి?

అప్పట్లో కృష్ణవేణికి ఏఎన్నార్‌ అంటే చాలా ఇష్టమట. ఆయన సినిమా షూటింగ్‌లకు కచ్చితంగా వెళ్లేదట. ఓ సారి ఏఎన్నార్‌ మూవీ ఓపెనింగ్‌ కి వెళ్తే.. ఆమెని చూసి పక్కన కూర్చోబెట్టుకున్నాడట. ఏంటి ఎలా ఉన్నావ్‌ అని అడిగితే, బిజీగా ఉన్నాను, సినిమాలు చేసి విసుగు వస్తుంది, ఎవరైన పెంచుకుంటే బాగుండు వెళ్లిపోతా అన్నదట కృష్ణవేణి. ఇది విన్న ఏఎన్నార్‌.. నిన్నెవరు పెంచుకుంటాడు, ఉంచుకుంటారుగానీ అన్నాడట. దెబ్బకి మైండ్‌ బ్లాక్‌ అయ్యిందట. ఏంటండి అలా అంటున్నారని అడిగితే, మరేంటి.. మంచిగా సినిమాలు వస్తున్నాయి, బిజీగా ఉన్నావు, సినిమాలు చేసుకోకా, వెళ్లిపోతానేంటి అని గట్టిగా వార్నింగ్‌ ఇచ్చాడట. ఇలా ఆయన మాటల్లో ప్రేమే ఉంటుందని ఆమె వెల్లడించింది. సుమన్‌ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకుంది సీనియర్‌ నటి కృష్ణవేణి.

ఏఎన్నార్‌ జీవితంలో జరిగిన ఈ సంచలన సంఘటన టాలీవుడ్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, వైరల్ వార్తల కోసం మా ఛానెల్‌ను చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.