|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Anshu Reddy: పెళ్లి క్యాన్సిల్, యూట్యూబ్ నుంచి నాలుగు లక్షల ఆదాయం… ఇల్లు ఇల్లాలు పిల్లలు నటి కామెంట్స్

Published: 16-08-2025, 2:19 AM
Anshu Reddy: పెళ్లి క్యాన్సిల్, యూట్యూబ్ నుంచి నాలుగు లక్షల ఆదాయం... ఇల్లు ఇల్లాలు పిల్లలు నటి కామెంట్స్

‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌లో నర్మదాగా ప్రేక్షకులను మెప్పించిన అన్షు రెడ్డి తన జీవితం, వృత్తి, నిశ్చితార్థం రద్దు గురించి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. యూట్యూబ్ ద్వారా ఆమె సంపాదిస్తున్న భారీ ఆదాయం కూడా ఆమె వెల్లడించింది.

Key Points

1

అన్షు రెడ్డి 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్‌తో పాపులర్ అయ్యారు.

2

యూట్యూబ్ ద్వారా నెలకు నాలుగు లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు వెల్లడించారు.

4

తెలుగు ఇండస్ట్రీలో కన్నడ బ్యాచ్‌పై చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి.

అన్షు రెడ్డి యూట్యూబ్ జర్నీ

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ విజయవంతంగా సాగుతోంది. అందులో కోడలు పిల్ల నర్మదా అంటే ఎంతో మందికి ఇష్టం. ఈమె అసలు పేరు అన్షు రెడ్డి. గవర్నమెంట్ ఉద్యోగం చేసే కోడలిగా, భర్తను ప్రేమించే భార్యగా, ఉత్తమ ఇల్లాలిగా ఆమె నటన ఎంతో మందిని ఆకట్టుకుంది. ఈ సీరియల్ తో అన్షు రెడ్డికి అభిమానులు పెరిగిపోయారు. ఆమె యూట్యూబ్ ఛానల్ లకు అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటుంది. అన్షు రెడ్డిగా పిలిచే నర్మదా అసలు పేరు0 అనూష. అనూష తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన స్నేహితురాలితో కలిసి పాల్గొంది. అందులో ఆమె తన ఎంగేజ్మెంట్ గురించి చెప్పింది.

చాలా మంది అభిమానులకు తెలియని విషయం ఏమంటే ఆమెకి మొదట ఒక అబ్బాయితో ఎంగేజ్మెంట్ అయ్యింది. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. ఆ నిశ్చితార్థం పెళ్లి వరకు చేరుకోలేదు. ఇదే విషయం గురించి ఆమె మాట్లాడుతూ ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని, ఆ విషయంలో తను ఏమాత్రం బాధపడటం లేదని వివరించింది. తనను మిస్సయిన వ్యక్తి అన్ లక్కీ ఫెలో అని కూడా కామెంట్ చేసింది. నిజానికి ఆ నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యాకే తను ఇంకా సంతోషంగా ఉన్నానని చెప్పింది. నిశ్చితార్థం క్యాన్సల్ అవ్వడానికి కారణం తమ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడమేనని చెప్పింది.

నిశ్చితార్థం రద్దుపై అన్షు రెడ్డి వ్యాఖ్యలు

అన్షు రెడ్డి మాట్లాడుతూ తాను ఒకప్పుడు 70 రూపాయల కూలీ పనులకు వెళ్లేదాన్నని… కానీ ఇప్పుడు ఎక్కువ మొత్తంలో సంపాదిస్తున్నట్టు వివరించింది. యూట్యూబ్ లో వీడియోల ద్వారానే నెలకు నాలుగు లక్షల రూపాయలు సంపాదించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పింది. యూట్యూబ్లో పూర్తిగా తమ వ్యక్తిగత జీవితమే చూపించలేక వీడియోలు తగ్గించానని లేకుంటే ఇప్పటికీ అంతే ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని వివరిస్తోంది నర్మదా.

అన్షు రెడ్డి గతంలో సంచలన కామెంట్లు చేసింది. తెలుగు ఇండస్ట్రీలో కన్నడ బ్యాచ్ ఎక్కువ అయిపోతుంది అని పబ్లిక్ గా మాట్లాడింది. దీంతో కన్నడ బ్యాచ్ వారికి అన్షు పై చాలా కోపం వచ్చింది. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వారిపై కోపాన్ని చూపిస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. అందుకే వారు ఆమెను ఏమీ అనలేకపోయారు.

తెలుగు ఇండస్ట్రీపై అన్షు రెడ్డి కామెంట్స్

అన్షు రెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు స్టార్ మహిళ గేమ్ షోలో కనిపించింది. ఆ షోలో ఆమె అందం, చురుకుదనం చూసి ఆడిషన్స్ కు పిలిచారు. అలా ఆమె ఎన్నో గేమ్స్ లో పాల్గొంది. చివరికి సీరియల్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సక్సెస్ అయింది. సీరియల్ లో తనకు పెద్దగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లు ఏవీ లేవని వివరించింది. అన్షు రెడ్డికి ఇప్పుడు సీరియల్ బ్యాచ్ లో ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. ఇక యూట్యూబ్లో మూడు లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు.

అన్షు రెడ్డి జీవితంలోని వివిధ అంశాలను ఈ ఇంటర్వ్యూలో చర్చించారు. ఆమె వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం గురించి ఆమె అభిప్రాయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.