|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Anshu Sagar: వేరే ఏదైనా పని చూసుకోండిరా బాబు

Published: 18-08-2025, 7:18 AM

సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్లు ఎదుర్కొంటున్న సెలబ్రిటీలకు అన్షు సాగర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ‘మన్మథుడు’ సినిమా నటి అయిన ఆమె, తన జీవితం, కెరీర్ గురించి మాట్లాడింది.

Key Points

1

అన్షు సాగర్ సోషల్ మీడియాలో వచ్చే నెగటివ్ కామెంట్లకు సెటైరికల్‌గా స్పందించింది.

2

ఇద్దరు పిల్లల తల్లి అయినా, తన జీవితంపై తనకున్న నియంత్రణను ప్రదర్శించింది.

4

తెలుగు సినీ రంగంలో తన అనుభవాలు, ప్రస్తుత జీవితం గురించి తెలిపింది.

అన్షు సాగర్ యొక్క సోషల్ మీడియా స్పందన

సోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగం ఉందో అంతే అనర్థాలు కూడా ఉన్నాయి. చాలామంది అదేపనిగా నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటారు. విపరీతంగా ట్రోల్స్ చేస్తుంటారు. సెలబ్రిటీలు వీటి బారిన ఎక్కువగా పడుతుంటారు. కొందరు వీటిని లైట్ తీసుకుంటే మరికొందరు మాత్రం ఘాటుగా స్పందిస్తుంటారు. ఇప్పుడు అలానే ‘మన్మథుడు’ హీరోయిన్ కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్లకు అదిరిపోయే రిప్లై ఇచ్చింది.

‘ఇ‍ద్దరు పిల్లల తల్లివి, కాస్త పద్ధతిగా ప్రవర్తించు.. 20 ఏళ్ల పిల్లవేం కాదు నువ్వు.. సర్జరీ చేసుకోకముందే బాగుండేదానివి, ఇప్పుడు బక్కపలుచగా ఉన్నావ్. ఇలాంటి కామెంట్స్ పెట్టే బదులు వేరే ఏదైనా పని చూసుకోండి. ఎందుకంటే వీటి వల్ల మీరు ఎలాంటి వాళ్లో అర్ధమవుతోంది. అవును నాకు ముడతలు ఉన్నాయి. ఇప్పటివరకు సర్జరీలు చేసుకోలేదు. ఫిల్లర్స్ కూడా పెట్టించుకోలేదు. బొద్దుగా ఉన్నప్పుడు నాకే ఇబ్బందిగా అనిపించేది. ఇప్పుడు ఓకే కదా? జీవితంలో ఏం చేయడానికైనా టైమ్ అంటూ లేదు. కలలు కనండి. మీకు సంతోషాన్ని కలిగించే పని మాత్రమే చేయండి’ అని అన్షు తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.

మన్మథుడు తర్వాత అన్షు జీవితం

యూకేలో పుట్టి పెరిగిన అన్షు.. 15 ఏళ్లకే ఇండస్ట్రీకి వచ్చింది. నాగార్జున ‘మన్మథుడు’ సినిమాతో పరిచయమైంది. తొలి మూవీతో హిట్ కొట్టింది. కానీ తర్వాత చేసిన రాఘవేంద్ర, మిస్సమ్మ చిత్రాలు ఫెయిలవడంతో తిరిగి యూకే వెళ్లిపోయింది. సైకాలజీలో మాస్టర్స్ చేసి సొంతంగా క్లినిక్ పెట్టుకుంది. 2011లో 24 ఏళ్ల వయసులోనే సచిన్ సాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే చాన్నాళ్ల తర్వాత తెలుగులో ‘మజాకా’ మూవీతో అన్షు రీఎంట్రీ ఇచ్చింది.

నెగటివ్ కామెంట్లకు ఆమె సమాధానం

ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్షు రీఎంట్రీ సినిమా రిలీజ్ కాగా హిట్ కాలేదు. దీంతో ఈమె తిరిగి యూకే వెళ్లిపోయింది. అయితే గత కొన్నిరోజులుగా తన ఇన్ స్టా పోస్టుల్లో వస్తున్న నెగిటివ్ కామెంట్స్‌పై ఇప్పుడు సెటైరికల్‌గా స్పందిస్తూ పోస్ట్ పెట్టింది.

అన్షు సాగర్ తన స్వంత నిర్ణయాలను గౌరవించేలా ప్రేక్షకులకు సందేశం ఇచ్చింది. సోషల్ మీడియాలో నెగటివిటీని ఎదుర్కొనే తన విధానాన్ని తెలియజేసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.