|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్టార్ హీరోలతో నటించి రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నా.. ఇకపై అలాంటి మూవీస్ చేయను: అనూ ఇమ్మాన్యుయేల్

Published: 11-11-2025, 10:16 PM
స్టార్ హీరోలతో నటించి రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నా.. ఇకపై అలాంటి మూవీస్ చేయను: అనూ ఇమ్మాన్యుయేల్

స్టార్ హీరోల చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్న అనూ ఇమ్మాన్యుయేల్, కొన్ని కమర్షియల్ సినిమాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భవిష్యత్తులో పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే చేస్తానని, ఇకపై అలాంటి మూవీస్ చేయనని ఆమె స్పష్టం చేసింది.

Key Points

1

అనూ ఇమ్మాన్యుయేల్ స్టార్ హీరోల చిత్రాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

2

కొన్ని కమర్షియల్ చిత్రాలు నటిగా సంతృప్తి ఇవ్వలేదని వెల్లడించింది.

4

ఆమె త్వరలో 'బూమరాంగ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అనూ ఇమ్మాన్యుయేల్ కెరీర్ అసంతృప్తి

తెలుగులో స్టార్ హీరోల చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుని ఇండస్ట్రీలో కొనసాగుతోంది. పలు హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్న అనూ ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel)రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. మళ్లీ ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend)చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇందులో హీరోయిన్‌గా కాకుండా సహనటిగా చేసి తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనూ స్టార్ హీరోలతో నటించి ఫీల్ అవుతున్నట్లు తెలిపింది. ‘‘నటిగా సంతృప్తి ఉన్నప్పటికీ.. నేను నా సినీ ప్రయాణం పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నా.

స్టార్ హీరోలతో నటించి రిగ్రెట్

పవన్ కళ్యాణ్, నాని, అల్లు అర్జున్, కార్తీ, శివ కార్తికేయన్ వంటి స్టార్ హీరోలతో నటించా. అయినా నా కెరీర్‌లో కొన్ని సినిమాలు చేసి ఉండకూడదని ఇప్పుడు రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నా. కొన్ని కమర్షియల్ చిత్రాల్లో నటించడం వల్ల నటిగా నాకు ఎలాంటి సంతృప్తి రాలేదు. మనం ఎక్కువగా కనిపించే స్కోప్ ఉండదు కాబట్టి.. మొత్తంలో మనకి గుర్తింపు రాకుండా చేస్తారు. అందుకే ఇకపై అలాంటి సినిమాలే చేయను. నా పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే చేయాలని నిర్ణయించుకున్నాను.

కొత్త ప్రాజెక్టులు, భవిష్యత్ ప్రణాళికలు

ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నా.. ఓ సినిమా ఓకే చేశాను. త్వరలోనే దాని పూర్తి వివరాలు వెల్లడిస్తాను’’ అని చెప్పుకొచ్చింది. కాగా.. త్వరలో అనూ ‘బూమరాంగ్’ (Boomerang)చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినినిమాకు ఆండ్రీవ్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్, మైత్రీ ఆర్ట్స్ బ్యానర్స్‌పై లండన్ గణేశ్ నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేసుకోలేదు.

అనూ ఇమ్మాన్యుయేల్ నిర్ణయం ఆమె కెరీర్‌లో ఒక కీలక మలుపుగా మారనుంది. పాత్రకు ప్రాధాన్యతనిస్తూ, నటనకు స్కోప్ ఉన్న చిత్రాలను ఎంచుకోవడం ద్వారా ఆమె తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోగలదని ఆశిద్దాం.

Related News

బ్రహ్మముడి: ఇందు మాస్ స్ట్రోక్! బావను తీసుకెళ్తానంటూ చలపతికి బిగ్ షాక్! దుగ్గిరాల ఇంటికి రాజు ఎంట్రీ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమ-ధీరజ్ పెళ్లి సీక్రెట్ లీక్! వల్లికి షాక్.. ధీరజ్ డ్రామా మాస్!
వైరల్ సంచలనం! విజయ్ దేవరకొండ రియల్ హీరో మార్క్.. అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన రౌడీ స్టార్!
గుండె నిండా గుడి గంటలు: శోభకు రోహిణి మాస్ వార్నింగ్! మనోజ్ కళ్ళలో కొత్త వెలుగు... బిగ్ ట్విస్ట్!
OTT సంచలనం! సమంత యాక్షన్ షోతో రచ్చ! ప్రియురాలిపై రివేంజ్, ఈ వారం ఓటీటీలో ఊహించని ట్విస్టులు!
వైరల్ న్యూస్: ‘తమిళ మురుగన్’లో విజయ్ సేతుపతి ఎంట్రీ! ధనుష్-వెట్రిమారన్-సేతుపతి.. త్రిబుల్ నేషనల్ అవార్డ్ పవర్!
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.