
బ్రహ్మముడి సీరియల్ అభిమానులకు ఇది నిజంగా పండగే! తాజాగా విడుదలైన ఎపిసోడ్ ఉత్కంఠను తారాస్థాయికి చేర్చింది. ఇందు సంచలన నిర్ణయం, చలపతికి షాక్, రాజు జీవితంలో ఊహించని మలుపులు.. అన్నింటికీ మించి దుగ్గిరాల ఇంట్లో రాజు ప్రవేశం! ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం!
Key Points
ఇందు సంచలన నిర్ణయం: బావ రాజును తన ఇంటికే తీసుకెళ్తానని ప్రకటన!
చలపతికి ఊహించని షాక్: ఇందు మాటలతో కంగుతిన్న చలపతి, నిస్సహాయత!
రేఖ కుట్ర లీక్: రాజును అంతం చేయాలన్న ప్లాన్ స్వాతికి తెలిసిపోయింది!
రాజుకు యాక్సిడెంట్: దుగ్గిరాల కుటుంబంలోకి అతని ఎంట్రీ ఖాయం!
ఇందు మాస్ సవాల్: చలపతికి బిగ్ షాక్!
Brahmamudi July 13th Episode: బ్రహ్మముడి సీరియల్ జులై 13 ఎపిసోడ్ లో చలపతికి ఇందు పెద్ద షాకే ఇస్తుంది. రాజు తన బావ అని తెలుసుకున్న ఆమె.. అతన్ని తన ఇంటికే తీసుకెళ్తానని తేల్చి చెబుతుంది. అతని జీవితంలో నుంచి వెళ్లిపోయే ప్రసక్తే లేదని అంటుంది.
Brahma Mudi Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా, ఎమోషనల్ గా సాగిపోయింది. రాజుకు యాక్సిడెంట్ కావడం, తాము పెంచుకున్న కొడుకు కోసం చలపతి, లక్ష్మీ కన్నీరుమున్నీరవడం.. రాజు దుగ్గిరాల వారసుడు అని తెలుసుకున్న ఇందు.. అతన్ని తన వెంటే తీసుకెళ్తానని పట్టుబట్టడంలాంటి సీన్లతో ఈ ఎపిసోడ్ రక్తి కట్టించింది.
రేఖకు రాజు ఫోన్.. లక్కీని తీసుకొస్తానని వార్నింగ్
వెంటనే ఇంట్లో వాళ్లకు నిజం చెప్పెయ్.. లక్కీకి నీ తల్లి దొరికేసిందని ఇప్పటికే చెప్పాను.. నీ ఫోన్ కోసం వాడు వెయిట్ చేస్తున్నాడు.. నువ్వు చెప్పకపోతే లక్కీని నేరుగా ఇంటికే తీసుకొచ్చి అందరి ముందూ నిజం చెప్పేస్తానని వార్నింగ్ ఇస్తాడు. వాడికి నా పేరు చెప్పావా అని రేఖ అడుగుతుంది. లేదు.. అది నీ నోటితోనే వినాలని రాజు అంటాడు. సరే అని ఫోన్ పెట్టేస్తుంది.
రాజుకు ఫుల్‌స్టాప్ పెడతానన్న రేఖ.. వినేసిన స్వాతి
రేఖ కుట్ర లీక్: రాజు ప్రాణాలకు ముప్పు!
ఇక ఆ రాజుగాడి ఛాప్టర్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని ఆలోచిస్తున్నాను.. ఈరోజుతో రాజు కాస్తా లేట్ రాజు అవుతాడు అని వాళ్లతో అంటుంది రేఖ. అది కాస్తా స్వాతి వింటుంది. రాజును లేపేయడానికి అంతా సిద్ధం చేశానని, మరికాసేపట్లో వార్త వస్తుందని, ఇక వాడి పీడ విరగడైనట్లే.. మళ్లీ మన రాజ్యమే వస్తుందని రేఖ స్పష్టం చేస్తుంది.
ఇందుకి రేఖ ప్లాన్ చెప్పిన స్వాతి.. ఫోన్ చేసినా ఎత్తని రాజు
అప్పటికే లక్కీ మరోసారి రాజుకు ఫోన్ చేసి తన తల్లి ఎవరో చెప్పరా అని అడుగుతూ ఉంటాడు. దీంతో ఫోన్ బిజీ వస్తుంది. వీడు మళ్లీ మళ్లీ ఇలా ఫోన్ చేసి విసిగిస్తూనే ఉంటాడు.. ఫోన్ సైలెంట్ లో పెట్టేస్తాడు రాజు. దీంతో ఇందు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాజు లిఫ్ట్ చేయడు.
చలపతికి ఇందు ఫోన్.. రాజు ప్రాణాలు ప్రమాదంలో అంటూ..
రాజుకు యాక్సిడెంట్.. రేఖ ఫుల్ ఖుష్..
దుగ్గిరాల ఇంట్లోకి రాజు: కీలక మలుపు!
ఇందుకి అసలు నిజం చెప్పేసిన చలపతి
రాజు పెంచుకున్న కొడుకని చెప్పిన చలపతి.. ఇందు షాక్
బావను తీసుకెళ్తానన్న ఇందు
నీ అతడికి ఏమీ కాకుండా చూడాలని మొక్కుకుంటుంది. తిరిగి హాస్పిటల్ కు వచ్చిన ఆమెను చలపతి మళ్లీ వారిస్తాడు. కానీ రాజు నా బావ.. నా బావను నా ఇంటికి తీసుకెళ్తాను.. దూరంగా ఉండటం కుదరదు అని చలపతికి ఇందుకు తేల్చి చెప్పడంతో అతడు షాక్ తింటాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
బ్రహ్మముడి సీరియల్‌లో రాబోయే ఎపిసోడ్‌లు మరింత ఉత్కంఠగా మారనున్నాయి. ఇందు, రాజు, రేఖల మధ్య జరిగే నాటకీయ పరిణామాలు ప్రేక్షకులను అబ్బురపరచడం ఖాయం. మరిన్ని సంచలన అప్‌డేట్‌ల కోసం మా వెబ్‌సైట్‌ను చూస్తూ ఉండండి!


