|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనుదీప్ దెబ్బకు పీపుల్ మీడియా ఖేల్ ఖతం? ఏం జరగబోతుంది?

Published: 28-03-2026, 10:05 AM
అనుదీప్ దెబ్బకు పీపుల్ మీడియా ఖేల్ ఖతం? ఏం జరగబోతుంది?
  • అనుదీప్ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రం రాబోతుంది.
  • పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించనుంది.
  • అనుదీప్ కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను నిరాశపరిచాడు.
  • అనుదీప్ గత చిత్రం ‘ఫంకీ’ ఫలితం నిరాశపరిచింది.

దర్శకుడు అనుదీప్ కొత్త సినిమాతో వస్తున్నాడు. ఈసారి పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేస్తున్నాడు. గతంలో అనుదీప్ సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

అనుదీప్ కొత్త సినిమా ప్రయత్నాలు

Anudeep new movie : అనుదీప్ …తొలిసినిమా పిట్టగోడ అడ్డంగా కూలిపోయినా తర్వాత వచ్చిన ‘జాతిరత్నాలు’తో పెద్ద మ్యాజిక్కే చేశాడు. ఇంకేం ఇండస్ట్రీకి ఒక ప్రామినెంట్ డైరెక్టర్ దొరికాడని మురిసిపోయింది టాలీవుడ్. కానీ అది అప్పటి వరకే అంటూ ‘ప్రిన్స్’, ‘ఫంకీ’ సినిమాలతో ఆడియన్స్ పేషన్స్ కి పెద్ద టెస్టే పెట్టాడు.ఇక కామెడీ పేరుతో ఆయన తీస్తున్న ‘కిచిడీ’ సినిమాలు చూసి అనుదీప్ కెరీర్‌కు ‘ఎండ్ కార్డ్’ పడటం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాయ్.అయితే ఈ సారి ఆ తప్పు జరగనివ్వను అంటూ తన ఉనికిని చాటుకోవడాని ఓ సరి కొత్త లేడీ ఓరియెంటెడ్’ రాగం అందుకున్నాడని తెలుస్తుంది .

మునిగే నావకు తోడు దొరికిందిగా ..

అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తామంటూ ఎంట్రీ ఇచ్చిందట పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఇప్పటికే ‘రాజా సాబ్’ లాంటి భారీ ప్రాజెక్టులతో చేతులు కాల్చుకుని, కథల విషయంలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ఆ సంస్థకు.. ఇప్పుడు అనుదీప్ తోడవటం చూస్తుంటే “మునిగే నావకు తోడు దొరికిందిగా ”అంటూసెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.అసలే ఇపుడు అనుదీప్‌కున్న క్రెడిబిలిటీ జీరో, పైగా పీపుల్ మీడియాకు సాలిడ్ హిట్ అవసరం. అలాంటిది వీరిద్దరూ జోడీ కట్టి ఏం ఉద్ధరిస్తారో ఏంటో అని ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పరిస్థితి ఏమిటి?

ఇక ఈ లేడీ ఓరియెంటెడ్ కథ చాలా సీరియస్ ఇష్యూ చుట్టూ తిరుగుతుందని ఇన్ సైడ్ టాక్ . కాని అనుదీప్ అంటేనే పిచ్చి పిచ్చి కామెడీ, లాజిక్ లేని పంచ్‌లు. అలాంటి అనుదీప్ దగ్గర ‘సీరియస్’ అనే పదానికి చోటు ఉందా? అని ప్రశ్నిస్తున్నారు ఆడియన్స్.అనుదీప్ మార్క్ కామెడీని ఎక్స్ పెక్ట్ చేయొద్దని ఇప్పటి నుండే లీకులు ఇస్తున్నారు కానీ, అసలు ఆయన సీరియస్ గా సినిమా తీస్తే జనం థియేటర్లో కూర్చుంటారా? అన్నదే ఇక్కడ పెద్ద డౌట్.

‘జాతిరత్నాలు’లా ముగ్గురు మిత్రుల కథ

వాస్తవానికి అనుదీప్ దగ్గర ‘జాతిరత్నాలు’ లాంటి జానర్ లో ముగ్గురు మిత్రుల కథ రెడీగా ఉందట. కానీ ‘ఫంకీ’ రిజల్ట్ చూశాక, అనుదీప్‌ను నమ్మడానికి ఏ ఒక్క యంగ్ హీరో కూడా డేర్ చేయడం లేదని, కనీసం ఫోన్ చేస్తే కనీసం అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు కూడా వెనకాముందు అవుతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయ్. దీంతో చేసేదేమీ లేక, తన పరువు కాపాడుకోవడానికి ఇలా లేడీ ఓరియెంటెడ్ కథను తెరపైకి తెచ్చాడట ఈ కుర్ర డైరెక్టర్.

అయితే ఈ కథకు ఒక స్టార్ హీరోయిన్ ఉంటేనే వాల్యూ వస్తుందని అనుదీప్ చెప్పడంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏదో ఒక స్టార్ హీరోయిన్‌ను ఒప్పించి, భారీ రెమ్యూనరేషన్ ఆశ చూపి టీమ్‌లోకి తీసుకురావాలని చూస్తోందట . కానీ అనుదీప్ ప్రెసెంట్ ట్రాక్ రికార్డ్ చూసి ఏ స్టార్ హీరోయిన్ అయినా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? లేక తన కెరీర్‌ను రిస్క్‌లో పడేసుకుంటుందా? అన్నది చూడాలి.

లేడీ ఓరియెంటెడ్ కథతో హిట్ కొడతాడా?

మరో కోలుకోలేని దెబ్బ తీస్తారా?

మొత్తానికి, అనుదీప్ తనకున్న పరిచయాలన్నీ వాడి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని చూస్తున్నాడు.మరి ఫ్లాపుల ఊబిలో ఉన్న పీపుల్ మీడియాను ఈ ‘లేడీ ఓరియెంటెడ్’ సినిమా గట్టెక్కిస్తుందా? లేక అనుదీప్ తన మార్క్ ‘ఫంకీ’మ్యాజిక్ ఆ సంస్థకు మరో కోలుకోలేని దెబ్బ తీస్తారా? వేచి చూడాలి!

మొత్తానికి అనుదీప్ ఒక లేడీ ఓరియెంటెడ్ కథతో వస్తున్నాడు. ఈ సినిమాతో అయినా తన కెరీర్ నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇది ఎంతవరకు కలిసి వస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.