
📌 Key Points
- విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా ‘ఫంకీ’ మూవీ ఫిబ్రవరి 13న రిలీజ్!
- దర్శకుడు అనుదీప్ గెస్ట్ రోల్, హరీష్ శంకర్, దిల్ రాజు వంటి దర్శకులు కూడా మెరవనున్నారు!
- సినిమా పరిశ్రమలోని సంఘటనలు సరదాగా చూపించామని తెలిపిన అనుదీప్.
- ఫంకీ సినిమాలో కామెడీతో పాటు కుటుంబ భావోద్వేగాలు కూడా ఉంటాయన్న అనుదీప్!
టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు అనుదీప్ రెడీ అయ్యాడు. ‘జాతిరత్నాలు’ తర్వాత అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న ‘ఫంకీ’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 13న విడుదల కానుంది. ఇందులో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నాడు.
ఫిబ్రవరి 13న ‘ఫంకీ’ మూవీ రిలీజ్!
Anudeep : జాతిరత్నాలు సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్ ఇప్పుడు ఫంకీ సినిమాతో రాబోతున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా తెరకెక్కుతున్న ఫంకీ సినిమా ఫిబ్రవరి 13 రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనుదీప్ నేడు మీడియాతో మాట్లాడాడు.(Anudeep)
అనుదీప్ సినిమా టైటిల్ గురించి, సినిమా గురించి మాట్లాడుతూ..ఫంకీ టైటిల్ వినడానికి క్యాచీగా ఉందని పెట్టాము అంతే. ఇప్పటి జనరేషన్ కి కనెక్ట్ అవుతుందని ఈ టైటిల్ తీసుకున్నాం. ఫంకీ అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కామెడీతో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్. దర్శకుల జీవితాల్లో, సినీ పరిశ్రమలో జరిగే కొన్ని సంఘటనలను సాధారణ ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా సరదాగా చూపించాను. ఇందులో ప్రేమ కథతో పాటు కుటుంబానికి సంబంధించిన భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉంటాయి. నా సినిమాల్లో కామెడీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లాజిక్ ఉండదని అనుకుంటారు కానీ అన్ని సినిమాల్లో లాజిక్ ఉంటుంది. ఫంకీ సినీ నేపథ్యం సినిమా అయినా సాధారణ ప్రేక్షకులకు అర్ధం అవుతుంది అని అన్నారు.
దర్శకుల జీవితాలపై అనుదీప్ సెటైర్లు!
విశ్వక్ సేన్, కయదు లోహర్ గురించి చెప్తూ.. విశ్వక్ సేన్ ఇందులో ఒక సినిమా దర్శకుడి పాత్రలో కనిపిస్తారు. ఈ పాత్రను రాసుకున్నప్పుడే విశ్వక్ అయితే బాగుంటారు అనుకున్నాను. ఈ నగరానికి ఏమైంది సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ బాగుంటుంది. కయాదు లోహర్ నిర్మాతల ఛాయిస్. తెలుగు రాకపోయినా ఆమెకు హిందీలో అర్థమయ్యేలా చెప్పి చేయించుకున్నాను అని తెలిపారు అనుదీప్.
అనుదీప్ చాలా సినిమాల్లో గెస్ట్ పాత్రల్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా కనిపించబోతున్నారు. అలాగే ఈ సినిమాలో చాలా మంది గెస్ట్ రోల్స్ చేసారని తెలిపాడు. అనుదీప్ దీనిపై స్పందిస్తూ.. ఫంకీ సినిమాలో కూడా నేను గెస్ట్ రోల్ లో కనిపిస్తాను. నాకు నటుడిగా కంటే దర్శకుడిగానే సినిమాలు చేయడం ఇష్టం. నేను పూర్తిస్థాయి నటుడిగా, హీరోగా మారను. ఎవరైనా అడిగితే సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తాను. ఈ సినిమాలో నాతో పాటు హరీష్ శంకర్, కళ్యాణ్ శంకర్, దిల్ రాజు, నాగవంశీ.. ఇంకా కొంతమంది దర్శక నిర్మాతలు గెస్ట్ పాత్రల్లో కనిపించబోతున్నారు అని తెలిపాడు. దీంతో ఇంతమంది దర్శక నిర్మాతలను గెస్ట్ రోల్స్ కి ఒకే సినిమాలో ఒప్పించాడు అంటే అనుదీప్ గ్రేట్ అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.
గెస్ట్ రోల్స్‌లో మెరవనున్న టాప్ డైరెక్టర్స్!
ఈ సినిమా నిర్మాణ సంస్థ గురించి మాట్లాడుతూ.. ఫంకీ సినిమా మొదట నాగవంశీ గారికే వినిపించాను. ఆయనకు కథ నచ్చి వెంటనే సినిమాకు ఒప్పుకున్నారు. త్రివిక్రమ్ గారు కూడా ఫైనల్ కాపీ చూసి కొన్ని ఛేంజెస్ చెప్పారు. నిర్మాత చినబాబు గారితో ఈ సినిమాకు ఎక్కువగా ట్రావెల్ చేశాను. నాగవంశీ బిజీగా ఉండటంతో చినబాబు గారితో ఈ సినిమాకు సంబంధించి చర్చించేవాడిని అని తెలిపారు.
అనుదీప్ తన నెక్స్ట్ సినిమాల గురించి మాట్లాడుతూ.. వెంకటేష్ గారికి కథ చెప్పాను. ఆయన చేంజెస్ చెప్పారు. చేంజెస్ చేసి సురేష్ బాబు గారికి వినిపించాలి. ఆయన ఓకే అంటే సినిమా ఓకే అవుతుంది. ఫీమేల్ ఓరియెంటెడ్ కథ ఒకటి రాస్తున్నాను. కామెడీ జానర్ మాత్రమే కాదు తర్వాత ఎమోషన్స్, యాక్షన్స్ లాంటి జానర్ సినిమాలు కూడా చేస్తున్నా అని తెలిపారు అనుదీప్.
ఫంకీ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అనుదీప్ దర్శకత్వం, విశ్వక్ సేన్ నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


