
📌 Key Points
- అనిల్ కపూర్ నటనకు ఫిదా అయిన అనురాగ్ కశ్యప్, ఓటీటీలో సినిమా చూడటం మిస్ అయినందుకు కామెంట్!
- సుబేదార్ మూవీలో రాధికా మదన్ నటన అద్భుతం, సౌరభ్ శుక్లా యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి!
- దర్శకుడు సురేష్ త్రివేణి బుందేల్‌ఖండ్ నేటివిటీని అద్భుతంగా చూపించారు అని ప్రశంసలు
- పూలన్ దేవి పుట్టిన గడ్డపై మహిళల పోరాట స్ఫూర్తిని గుర్తు చేసిన సుబేదార్ మూవీ!
అనిల్ కపూర్ నటించిన ‘సుబేదార్’ మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమాపై బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తన రివ్యూతో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేశారు. ఆయన ఏమన్నారో తెలుసా?
అనిల్ కపూర్ నటనకు అనురాగ్ ఫిదా!
Anurag Kashyap Review On OTT Movie Subedaar: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న అనిల్ కపూర్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ ‘సుబేదార్’పై బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాను థియేటర్లలో చూసుంటే ఆ మజా వేరేలా ఉండేదని, అనిల్ కపూర్ నటనలో ఇంకా ఆ పాత సెగ తగ్గలేదని కొనియాడారు.
బాలీవుడ్ సీనియర్ హీరో, యానిమల్ యాక్టర్ అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సుబేదార్’ (Subedaar) మార్చి 5 నుంచి నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా జోనర్‌లో తెరకెక్కిన సుబేదార్ మూవీ ఓటీటీ రిలీజ్ తర్వాత మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది.
బుందేల్‌ఖండ్ నేటివిటీ అద్భుతంగా ఉంది
కానీ, అనిల్ కపూర్ నటనకు మాత్రం అందరూ జై కొడుతున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సుబేదార్ మూవీపై తన రివ్యూను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సినిమా ఓటీటీలో కాకుండా థియేటర్లలో విడుదల కావాల్సింది అంటూ అనురాగ్ కశ్యప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“సుబేదార్ దర్శకుడు సురేష్ త్రివేణి బుందేల్‌ఖండ్, చంబల్ ప్రాంతాల్లోని పితృస్వామ్య వ్యవస్థను, అక్కడి మనుషుల ప్రవర్తనను చాలా సహజంగా చూపించారు. పూలన్ దేవి వంటి వారు పుట్టిన ఆ గడ్డ మీద మహిళలు కూడా పురుషులతో సమానంగా పోరాడతారని ఈ సినిమా మరోసారి గుర్తు చేసింది” అని అనురాగ్ కశ్యప్ పేర్కొన్నారు.
రాధికా మదన్, సౌరభ్ శుక్లా అదుర్స్!
“ఇక రాధికా మదన్ తన నటనతో మెరిసిపోయింది. అసలు సౌరభ్ శుక్లా (కల్లు మామ) యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయని నేను 2026 క్యాలెండర్‌లో అస్సలు ఊహించలేదు. నిజంగా చాలా మజా వచ్చింది సార్” అని అనురాగ్ కశ్యప్ రివ్యూ ఇస్తూ సుబేదార్ మూవీని ప్రశంసించారు.
సుబేదార్ మూవీపై అనురాగ్ కశ్యప్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


