|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఫోటోలు అడిగిన పూరీ జగన్నాథ్‌ కి అనుష్క ఏం ఇచ్చిందో తెలుసా? డైరెక్టర్‌కి ఫ్యూజుల్‌ ఎగిరిపోయాయి

Published: 06-11-2025, 10:09 AM
ఫోటోలు అడిగిన పూరీ జగన్నాథ్‌ కి అనుష్క ఏం ఇచ్చిందో తెలుసా? డైరెక్టర్‌కి ఫ్యూజుల్‌ ఎగిరిపోయాయి

నటి అనుష్క తన కెరీర్ ఆరంభంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను వెల్లడించింది. పూరీ జగన్నాథ్ `సూపర్‌` సినిమా కోసం ఫోటోలు అడిగితే, ఆమె పాస్‌పోర్ట్ ఫోటో ఇచ్చి డైరెక్టర్‌కు షాక్ ఇచ్చిందట. ఆమె సినీ ప్రయాణం ఎలా మొదలైందో ఇప్పుడు తెలుసుకోండి.

Key Points

1

అనుష్క గత చిత్రం `ఘాటి` నిరాశపరిచింది, ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌లు ప్రకటించలేదు.

2

సినిమాల్లోకి రాకముందు అనుష్క యోగా టీచర్‌గా పనిచేసేది.

4

పూరీ ఫోటోలు అడిగినప్పుడు అనుష్క పాస్‌పోర్ట్ ఫోటో ఇచ్చి ఆయన్ని ఆశ్చర్యపరిచింది.

అనుష్కకు `సూపర్‌` ఆఫర్‌ ఎలా వచ్చిందంటే?

స్వీటి అనుష్క లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. ఆమె ఇటీవల `ఘాటి` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. క్రిష్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. ఓల్డ్ కాన్సెప్ట్ తో సినిమా ఉండటంతో ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. దీంతో స్వీటి అభిమానులను మరోసారి డిజప్పాయింట్‌ చేసింది. ప్రస్తుతం ఆమె చాలా సెలక్టీవ్‌గా వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా కొత్తగా మరే సినిమాని ప్రకటించలేదు. నాగార్జున వందవ చిత్రంలో నటించబోతుందనే వార్తలు వచ్చాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే అనుష్క కెరీర్‌ బిగినింగ్‌కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కెరీర్‌ బిగినింగ్‌ లో తాను చేసిన పని బయటపెట్టింది అనుష్క. ఎంతటి అమాయకంగా వ్యవహరించిందో వెల్లడించింది. సినిమాల్లోకి రాకముందు ఆమె యోగా టీచర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తనకు `సూపర్‌`లో నటించే ఆఫర్‌ వచ్చింది. పూరీ జగన్నాథ్‌ ఆమెని చూసి ఫిదా అయ్యారు. తన సినిమాకి బాగా సెట్‌ అవుతారని భావించారు. అనుష్క యోగా గురువు ద్వారా ఆమెని సంప్రదిస్తే మొదట నో చెప్పిందట. చాలా సార్లు ప్రయత్నించినా రిజెక్ట్ చేసిందట.

పూరీ జగన్నాథ్ షాక్ అవ్వడానికి కారణం?

ఇలా లాభం లేదని చెప్పి ఏకంగా ఇంటికే వెళ్లారట. అనుష్కని డైరెక్ట్ గా చూసిన పూరీ జగన్నాథ్‌ ఆమెకి ఇంప్రెస్‌ అయ్యారు. అమాయకత్వమే ఆయనకు బాగా నచ్చింది. దీంతో సినిమాల్లో బాగా సూట్‌ అవుతుందనుకున్నారు. మాట్లాడి ఒప్పించిన తర్వాత దర్శకుడు పూరీ అనుష్కని ఫోటోలు అడిగారట. నాగార్జునకి చూపించేందుకు ఫోటోలు కావాలని అడిగితే ఆమె పాస్‌ఫోటో ఇచ్చిందట. ఆ  ఫోటోని చూసి పూరీకి ఫ్యూజులు ఎగిరిపోయాయి.  ఫోటోలు అడిగితే ఇది ఇచ్చిందేంటని ఆశ్చర్యపోయారట. అప్పటి వరకు తనవద్ద వేరే ఫోటోలు లేవట.  దీంతో ఆ ఫోటోని, ఆమెని విచిత్రంగా చూశాడట దర్శకుడు. అప్పుడు తనకు ఏం అర్థం కాలేదని తెలిపింది. ఆ ఫోటోనే తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత ముంబాయికి పిలిపించి ఫోటో షూట్‌ చేశారు. కనీసం కెమెరాకి ఫోజులివ్వడం కూడా రాలేదట. కెమెరా టీమ్‌ వివరించారని, అలా ప్రతిదీ తాను నేర్చుకున్నట్టు తెలిపింది అనుష్క. సినిమా అనేది తనకు ఒక లెర్నింగ్‌ ప్రాసెస్‌ అని చెప్పింది.

అలా తన సినిమా ఎంట్రీ జరిగిందని అనుష్క వెల్లడించింది. తానెప్పుడూ సినిమాల్లోకి వస్తానని అనుకోలేదు. కనీసం సినిమాలు కూడా చూడలేదు. ఇప్పుడు సినిమాలే ప్రపంచం అయిపోయిందని, ఇంతటి గుర్తింపు, అభిమానం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని తెలిపింది అనుష్క. యాంకర్‌ ప్రదీప్‌కి ఇచ్చిన కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా షోలో ఆమె ఈ విషయాలను వెల్లడించింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. అనుష్క `సూపర్‌` మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో బోల్డ్ రోల్‌ చేసింది. తాను స్వతహాగా చాలా స్వీటి. కానీ ఇందులో బోల్డ్ రోల్‌ చేయాల్సి వచ్చింది. అది మరో కొత్త అనుభవం అని చెప్పింది.

సినిమాల్లో అనుష్క నేర్చుకున్న పాఠాలు

అలా నాగార్జున, పూరీల ఒత్తిడి, ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చి ఇండస్ట్రీని దున్నేస్తోంది అనుష్క. ప్రారంభంలో రెగ్యూలర్‌ కమర్షియల్‌ చిత్రాలు చేసింది. నాగార్జున, బాలయ్య, వెంకటేష్‌, ప్రభాస్‌, రవితేజ, గోపీచంద్‌, మంచు విష్ణు వంటి వారితో కలిసి నటించింది. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తర్వాత `అరుంధతి` చిత్రంతో లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌ వైపు టర్న్ తీసుకుంది. తెలుగులో విజయశాంతి తర్వాత లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల ట్రెండ్‌కి తెరలేపింది. `భాగమతి`, `బాహుబలి` వంటి చిత్రాలతో అలరించింది. చివరగా ఆమె `ఘాటి`లో మెరిసిన విషయం తెలిసిందే.

యోగా టీచర్‌గా మొదలై, అమాయకంగా సినిమాల్లోకి వచ్చి, ప్రతిదీ నేర్చుకుంటూ అనుష్క స్టార్‌డమ్‌ సంపాదించుకుంది. కనీసం కెమెరాకు ఫోజులివ్వడం కూడా రాని ఆమె, ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.