|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: నాగార్జున మాటనే ఫాలో అవుతున్న అనుష్క! సినిమాలకు గుడ్ బై చెప్పేది ఎప్పుడో తెలుసా?

Published: 13-03-2026, 12:35 AM
షాకింగ్: నాగార్జున మాటనే ఫాలో అవుతున్న అనుష్క! సినిమాలకు గుడ్ బై చెప్పేది ఎప్పుడో తెలుసా?
  • నాగార్జున మాటని ఇప్పటికీ గుర్తుంచుకుంటున్న అనుష్క శెట్టి – సక్సెస్, ఫెయిల్యూర్ విషయంలో ఆ సూత్రమే ఫాలో అవుతున్నారట!
  • చివరగా ‘ఘాటి’ మూవీలో కనిపించిన అనుష్క – ప్రస్తుతం సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకే ప్రాధాన్యం!
  • బరువు సమస్యను బ్యాలెన్స్ చేస్తూనే సినిమాలు చేస్తున్న అనుష్క – సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు!
  • సినిమాల్లో సంతోషం లేకపోతే వదిలేస్తానన్న అనుష్క – యోగాలో జీవితాంతం గడపాలనుకున్నా, సినిమాలతో అదృష్టం కలిసొచ్చిందన్న స్వీటీ!

టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. నాగార్జున గారు ఆమెకు చెప్పిన ఒక ప్రత్యేకమైన సూచనను ఆమె ఇప్పటికీ పాటిస్తున్నారట. ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం.

నాగార్జున చెప్పిన ఆ ఒక్క మాట!

అనుష్క శెట్టి ఇప్పుడు సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తోంది. చివరగా ఆమె `ఘాటి` మూవీలో నటించింది. క్రిష్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ డిజాస్టర్‌ అయ్యింది. ప్రస్తుతం మరింత సెలక్టీవ్‌గా వెళ్తోంది. కొత్తగా ఇంకా ఏ సినిమాని ప్రకటించలేదు. బలమైన కథలే ప్రయారిటీ ఇస్తోంది. అందులోనూ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలే ఎక్కువగా చేస్తోంది అనుష్క. ఆమె బరువు అనేది కూడా సమస్యగా మారుతోంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమాలు చేస్తూ రాణిస్తోంది.

అనుష్క సౌత్‌ఇండియన్‌ సినిమాలోనే బిగ్గెస్ట్ స్టార్‌ హీరోయిన్‌. విజయశాంతి తర్వాత లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచింది. `అరుంధతి`తో ఆమె ఇమేజ్‌ మారిపోయిందని చెప్పొచ్చు. `బాహుబలి`తో అనుష్క క్రేజ్‌, ఇమేజ్‌ పీక్‌కి వెళ్లింది. తిరుగులేని స్టార్‌ అయిపోయింది. అయితే ఎంత పెద్ద స్టార్‌ అయినా, లేడీ సూపర్‌ స్టార్‌గా రాణిస్తోన్న అనుష్క మాత్రం ఒక్క విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేదట. అదే నాగార్జున చెప్పిన మాట. తాను ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, నాగ్‌ మాటని గుర్తు చేసుకుంటుందట. ఇప్పటికీ దాన్ని ఫాలో అవుతుందట.

సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తున్న అనుష్క

ఇంతకి నాగార్జున ఏం చెప్పాడు, అనుష్క ఏం ఫాలో అవుతుందనేది చూస్తే, అనుష్క హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం `సూపర్‌`. యోగ టీచర్‌గా చేస్తున్న అనుష్కని చూసి ఆమెని సినిమాల్లోకి తీసుకొచ్చారు. ఏం తెలియకుండానే సినిమాల్లోకి వచ్చింది, పూరీ జగన్నాథ్, నాగార్జున చెప్పిన విషయాలను ఫాలో అయ్యింది. తొలి చిత్రంతోనే ఆకట్టుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌ లో హాట్‌ కేక్‌ అయ్యింది. వరుసగా ఆఫర్లు, సక్సెస్‌ అందుకొని స్టార్‌ అయిపోయింది. అయితే `సూపర్‌` సమయంలోనే అనుష్కకి నాగార్జున ఒక మాట చెప్పాడు, అదేంటంటే.. జీవితంలోనూ కెరీర్‌ పరంగానూ ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురవుతుంటాయి. సక్సెస్‌ వచ్చిందని గాలిలో తేలిపోకుండా, ఫెయిల్యూర్‌ వచ్చిందని కుంగిపోకుండా నేల మీద నడవాలని చెప్పారు. ఆ మాట ఇప్పటికీ పాటిస్తుంటా` అని చెప్పింది అనుష్క.

సినిమాలకు గుడ్ బై చెప్పేది ఎప్పుడంటే?

ఇక సినిమాలు మానేయడానికి సంబంధించి ఆమె మాట్లాడుతూ, తాను ఏ రంగంలో అయినా సంతోషం తగ్గిపోతే దాన్ని వదిలేస్తాను అని చెప్పింది. సినిమాలు మానేస్తారా అనే ప్రశ్నకి ఆమె స్పందిస్తూ, నేను ఏం చేసినా ఎంజాయ్‌ చేస్తా. చేస్తున్న పనిలో సంతోషం లేకపోతే నన్ను సంతోషపెట్టి మరో పని చేస్తాను. ఒకవేళ నేను ఎంజాయ్‌ చేయలేకపోతే ఇదే కాదు, ఏ పనీ చేయను. నేను యోగాకి వెళ్లినప్పుడు జీవితాంతం అదే చేద్దామనుకున్నా. ఇంతలో సినిమాలు చేసే అదృష్టం వచ్చింది. ఇప్పుడు యాక్టింగ్‌ ఎంజాయ్‌ చేస్తున్నా` అని వెల్లడించింది అనుష్క. ఆరేళ్ల క్రితం ఓ పేపర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకుంది అనుష్క.

అనుష్క కెరీర్ గురించి, ఆమె ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి. త్వరలో మరిన్ని అప్డేట్స్ అందిస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.