
📌 Key Points
- అనుష్క పెళ్లి వార్తల్లో నిజం లేదని తేల్చేసిన టీమ్!
- అనవసరమైన పుకార్లను నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి!
- వ్యక్తిగత జీవితంపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్న అనుష్క టీమ్!
- ప్రస్తుతం అనుష్క తన తదుపరి సినిమాలపై పూర్తి దృష్టి!
టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేళ.. దీనిపై ఆమె టీమ్ స్పందించింది. అసలు విషయం ఏంటో తెలుసుకొండి! షాకింగ్ విషయాలు మీకోసం.
అనుష్క పెళ్లి వార్తల్లో నిజమెంత?
టాలీవుడ్ ‘జేజమ్మగా పేరుగాంచిన అనుష్క శెట్టి (Anushka Shetty) త్వరలోనే ఓ ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. ఈ వార్తలు వైరల్ కావడంతో అభిమానుల్లో అయోమయం నెలకొంది.ఈ క్రమంలో అనుష్క పెళ్లి పుకార్లపై ఆమె ప్రతినిధుల బృందం (Team) స్పందిస్తూ ఘాటుగా ఒక ప్రకటన విడుదల చేసింది. అనుష్క పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ కేవలం ఊహాగానాలేనని, వాటిలో ఏమాత్రం నిజం లేదని వారు స్పష్టం చేశారు.
పుకార్లపై అనుష్క టీమ్ ఆగ్రహం!
వ్యక్తిగత జీవితంపై అనవసర ప్రచారం వద్దు
సినిమాలపైనే అనుష్క పూర్తి దృష్టి!
“ఒకరి వ్యక్తిగత జీవితాన్ని వార్తలుగా మార్చే ముందు కనీసం అది నిజమా.. కాదా.. అని కూడా కొందరు చూడడం లేదు. ఊహించడం, అంచనా వేయడం, అనధికారిక సమాచారాన్ని పదేపదే ప్రచురించడం సరైన పద్ధతి కాదు” అంటూ అనుష్క టీమ్ తమ ప్రకటనలో అసహనం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. ప్రస్తుతం అనుష్క తన తదుపరి సినిమాలపై దృష్టి సారించారని, ఏదైనా విశేషం ఉంటే తామే అధికారికంగా వెల్లడిస్తామని తమ ప్రకనటలో అనూష్క టీమ్ పేర్కొన్నారు.
అనుష్క పెళ్లి వార్తలపై ఆమె టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఇకపై ఇలాంటి పుకార్లు నమ్మొద్దని కోరింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


