
📌 Key Points
- అనుష్కకు నాన్‌వెజ్ అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా రొయ్యల వేపుడు అంటే పడి చస్తుందని వెల్లడించింది.
- ప్రభాస్ కూడా రొయ్యలంటే చాలా ఇష్టపడతారట, ఇలా ఇద్దరి ఫుడ్ టేస్ట్ కలవడం విశేషం.
- అనుష్కకు హైదరాబాద్, పుస్తకాలు చదవడం, జీన్స్, కార్గోస్, పంజాబీ డ్రెస్‌లు అంటే ఇష్టం.
- యోగా టీచర్‌గా మారడం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిది అని స్వీటి పేర్కొంది.
టాలీవుడ్ నటి అనుష్క శెట్టికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెకు ఇష్టమైన ఆహారం, అభిరుచులు, ప్రభాస్‌తో ఆమె ఫుడ్ టేస్ట్ ఎలా మ్యాచ్ అయిందో వంటి వివరాలు వైరల్ అవుతున్నాయి. అనుష్క హాట్ ఫుడ్ సీక్రెట్‌తో పాటు ఆమె వ్యక్తిగత ఇష్టాలను తెలుసుకోండి.
అనుష్క ఇష్టమైన ఆహారం: నాన్‌వెజ్ సీక్రెట్
అనుష్క శెట్టి ఒకప్పుడు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. కానీ ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా వెళ్తోంది. ఇటీవల ఆమె `ఘాటి` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ ఆడియెన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. క్రిష్ రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె మలయాళంలో ఓ సినిమా చేస్తోంది. కొత్తగా మరే సినిమాకి సైన్ చేయలేదు.
ఇదిలా ఉంటే అనుష్కకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. తనకు ఇష్టమైన ఫుడ్ సీక్రెట్ తెలిసింది. ఓ పాత ఇంటర్వ్యూలో అనుష్క తనకు ఇష్టమైనవి వెల్లడించింది. అందులో తనకు ఇష్టమైన ఫుడ్‌ని ప్రత్యేకంగా మెన్షన్ చేసింది. అనుష్క చూడ్డానికి, తన మనసు చాలా స్వీటి, కానీ ఆమెకి ఇష్టమైన ఫుడ్ చాలా హాట్ కావడం విశేషం.
ప్రభాస్ తో ఫుడ్ టేస్ట్ కనెక్షన్
అనుష్కకి నాన్‌వెజ్ అంటే చాలా ఇష్టమట. నాన్ వెజ్ ఐటమ్స్ ని చాలా ఇష్టంగా తింటుందట. అందులోనూ రొయ్యలంటే చాలా ఇష్టమని చెప్పింది అనుష్క. తాను బయటకు ఎక్కడికి వెళ్లినా ఇష్టమైన ఫుడ్ బాగా తింటానని చెప్పింది. అందులో రొయ్యల వేపుడు అంటే పడి చస్తానని చెప్పింది. ప్రభాస్‌కి కూడా నాన్ వెజ్ అంటే ఇష్టం. అందులోనూ రొయ్యలు అంటే చాలా ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలా యాదృశ్చికంగా అనుష్క, ప్రభాస్ ఫుడ్ టేస్ట్ లు కలవడం విశేషం. ఈ ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ఇక అనుష్కకి ఇష్టమైన ప్రాంతాల్లో మన హైదరాబాద్ ఉండటం విశేషం. బెంగుళూరు, హైదరాబాద్ తనకు ఇష్టమైన ప్రాంతాలు అని చెప్పింది. ఎక్కువగా తాను హైదరాబాద్‌కి రావడానికి ఇష్టపడతానని వెల్లడించింది. ప్రకృతి అంటే ఇష్టం, ప్రకృతిపై రాసిన పుస్తకాలన్నా చాలా ఇష్టమట. ఖాళీ సమయంలో పుస్తకాలు చదువుతానని చెప్పింది అనుష్క.
స్వీటి ఇతర ఇష్టాలు: ప్రాంతాలు, అభిరుచులు
ఇంకా ఇష్టమైనవి చాలా చెప్పింది. దుస్తుల పరంగా జీన్స్, కార్గోస్, పంజాబీ డ్రెస్‌లు, అప్పుడప్పుడు చీరలంటే ఇష్టమని చెప్పింది. రంగుల విషయానికి వస్తే, నలుపు, తెలుపు, ఎరుపు ఇష్టమని చెప్పింది. ఆభరణాల గురించి చెబుతూ, చెవి రింగులు, నెక్లెస్‌లు ఇష్టమని పేర్కొంది. తన లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేని విషయం గురించి చెబుతూ, తాను యోగా టీచర్ మారడం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిది అని చెప్పింది స్వీటి.
మొత్తానికి, అనుష్క వ్యక్తిగత ఇష్టాలు, ముఖ్యంగా ఆమెకు ఇష్టమైన నాన్‌వెజ్ ఫుడ్ సీక్రెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రభాస్‌తో ఆమె ఫుడ్ టేస్ట్ పోలికలు, హైదరాబాద్‌పై ఆమె ప్రేమ వంటివి స్వీటిని మరింత దగ్గర చేస్తాయి.


