
ప్రముఖ ప్రయాణ వ్లాగర్ అన్వేష్ ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్నాడు. అక్కడి పెట్రోల్, నీటి ధరలు చాలా తక్కువ అని తెలిపాడు. కానీ ఇరాన్‌లో యుద్ధం జరుగుతుండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Key Points
ఇరాన్‌లో పెట్రోల్ ధర అత్యంత తక్కువ.
యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అభిమానుల ఆందోళన.
అన్వేష్ యొక్క ఇరాన్ పర్యటనపై చర్చ.
అన్వేష్‌కు అభిమానుల నుండి జాగ్రత్తలు, సూచనలు.
ఇరాన్‌లో పెట్రోల్, నీటి ధరలు
ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ప్రస్తుతం ఇరాన్‌లో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూపాయి మాత్రమేనని.. నీరు మాత్రం లీటర్‌కు ఆరు రూపాయలు అని.. అంత డిమాండ్ ఉందని తెలిపాడు. పక్క దేశాల్లో ఫ్యూయల్ లేక ఇబ్బందులు పడాలని.. రేట్లు పెరగాలని.. ఇక్కడ ఇంత చీప్‌గా అమ్ముతారని చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రమేయం గురించి కూడా వివరించాడు. ఇదంతా బాగానే ఉన్నా.. నా అన్వేషణ అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుందట కదా అక్కడకు ఎందుకు వెళ్లావని అడుగుతున్నారు. ఓ పక్క యుద్ధం జరుగుతుంటే ఈ వీడియోలు అవసరమా అంటూనే.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో ఏంటో జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నారు. త్వరగా అక్కడి నుంచి మరో చోటకు వెళ్లమని జాగ్రత్తలు చెప్తున్నారు. అయితే ఇంకొందరు అంత చీప్ ధరలు ఉన్నాయా అక్కడ.. వచ్చేటప్పుడు ఓ వెయ్యి లీటర్లు తీసుకొచ్చేయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
యుద్ధ భయంతో అభిమానుల ఆందోళన
అన్వేష్‌కు సూచనలు, జాగ్రత్తలు
అన్వేష్ యొక్క ఇరాన్ పర్యటన వివాదాస్పదంగా మారింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతని భద్రత కోసం ప్రార్థనలు చేస్తున్నారు.


