
📌 Key Points
- ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.
- పునర్విభజన చట్టం సవరణ బిల్లు-2026ను లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది.
- కేంద్ర హోంశాఖ ద్వారా విభజన చట్టంలోని సెక్షన్ 5ను సవరించనున్నారు.
- అమరావతిని ఆంధ్రప్రదేశ్ అధికారిక రాజధానిగా ఖరారు చేయాలనేది బిల్లు ఉద్దేశ్యం.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఏపీ పునర్విభజన చట్టం సవరణ బిల్లు-2026ను లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. తద్వారా అమరావతికి అధికారిక గుర్తింపు లభించనుంది.
అమరావతికి చట్టబద్ధత దిశగా అడుగులు
ఏపీ రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా మరో అడుగు ముందుకు పడనుంది. ఇవాళ లోక్‌సభలో ఏపీ పునర్విభజన చట్టం సవరణ బిల్లు-2026 ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు కేంద్ హోంశాఖ రంగం సిద్ధం చేసింది.
పునర్విభజన చట్టం సవరణ బిల్లు-2026
విభజన చట్టంలోని సెక్షన్ 5ను సవరించడం ద్వారా అమరావతిని ఆంధ్రప్రదేశ్ అధికారిక రాజధానిగా ఖరారు చేయనుంది. ముందుగా ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. ఆ తర్వాత లోక్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గురువారం రాజ్యసభలో ప్రవేశపెడుతారని అధికారిక వర్గాలు తెలిపాయి.
సెక్షన్ 5 సవరణ ద్వారా రాజధాని ఖరారు?
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
అమరావతి రాజధానిగా చట్టబద్ధత పొందేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన తర్వాత, అమరావతి ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక రాజధానిగా కొనసాగే అవకాశం ఉంది.


