
📌 Key Points
- ఏపీ ఈసెట్-2026 దరఖాస్తు గడువును మార్చి 12 వరకు పొడిగించారు.
- లేటరల్ ఎంట్రీ ద్వారా బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
- ఏప్రిల్ 23న ఏపీ ఈసెట్ 2026 పరీక్ష నిర్వహించబడుతుంది.
- ఫలితాలు మే 7న విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఏపీ ఈసెట్ 2026 దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. అర్హులైన విద్యార్థులు ఫైన్ లేకుండా మార్చి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. పరీక్ష తేదీ, ఫలితాల విడుదల తేదీలను కూడా ప్రకటించారు.
దరఖాస్తు గడువు పొడిగింపు
ఏపీ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈసెట్)-2026కు సంబంధించి అధికారులు మరో అప్డేట్ ఇఛ్చింది. ఆన్ లైన్ దరఖాస్తుల గడువును పొడిగించారు. అర్హులైన విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండానే మార్చి 12వ తేదీ వరకు అప్లయ్ చేసుకునే అవకాశం కల్పించారు.
ఏపీ ఈసెట్ ద్వారా 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది అనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(జేఎన్‌టీయూ-ఎ) నిర్వహిస్తోంది.
ముఖ్యమైన తేదీలు
కొత్త తేదీల ప్రకారం… లేట్ ఫీజు లేకుండా మార్చి 12వ తేదీ వరకు ఏపీ ఈసెట్ కు అప్లయ్ చేసుకోవచ్చు. ఆలస్య రుసుము రూ.1000తో దరఖాస్తులకు మార్చి 16, ఆలస్య రుసుము రూ.2000తో మార్చి 20 వరకు అవకాశం ఉంటుంది. ఇక లేట్ ఫీజు రూ.4000తో దరఖాస్తులకు చివరి తేదీని మార్చి 24గా నిర్ణయించారు. ఆలస్య రుసుము రూ.10,000తో మార్చి 28 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవటంతో పాటు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
పరీక్ష వివరాలు
మార్చి 28వ తేదీన ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. ఏప్రిల్ 9 నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. ఏప్రిల్ 23వ తేదీన ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 27వ తేదీన ప్రిలిమినరీ కీ విడుదలవుతుంది. ఏప్రిల్ 29 వరకు ప్రిలిమినరీ కీ పై అభ్యంతరాలను స్వీకరిస్తారు. మే 7వ తేదీన ఏపీ ఈసెట్ – 2026 ఫలితాలను ప్రకటిస్తారు.
ఏపీ ఈసెట్ 2026కు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది ఒక ముఖ్యమైన అవకాశం. గడువును సద్వినియోగం చేసుకుని, పరీక్షకు బాగా ప్రిపేర్ అవ్వండి. ఫలితాల కోసం వేచి ఉండండి.


