
📌 Key Points
- పంచాయతీ కార్యదర్శుల వేతనం రూ.28,280 నుంచి రూ.25,220కి తగ్గింపు
- జీవో నెంబర్ 91ని సవరిస్తూ జీవో 60 విడుదల చేసిన ప్రభుత్వం
- గ్రేడ్ 5 నుంచి గ్రేడ్ 3కి అప్‌గ్రేడ్ చేస్తూ గతంలో జీవో 91 జారీ
- తక్షణమే తదుపరి చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ కమిషనర్‌కు ఆదేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. జీవో నెంబర్ 91ని సవరిస్తూ, జీవో 60 ద్వారా వారి పేస్కేల్‌ను భారీగా తగ్గించింది. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
జీవో నెంబర్ 60 విడుదల చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ కార్యదర్శులకు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. జీవో నెంబర్ 91 సవరణతో పంచాయతీ కార్యదర్శులకు పేస్కేల్ తగ్గించింది. పంచాయతీ కార్యదర్శుల జీతం విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చ అవుతోంది.
గతంలో గ్రేడ్ 5 నుంచి గ్రేడ్ 3 హోదాకు అప్‌గ్రేడ్ చేస్తూ.. జారీ చేసిన జీవో 91 ప్రకారం వీరికి రూ.28,290 పేస్కేల్ నిర్ణయించారు. అయితే కూటమి ప్రభుత్వం ఆ ఉత్తర్వులను సవరిస్తూ.. జీవో 60ని విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పంచాయతీ కార్యదర్శుల పేస్కేల్‌ను రూ.28,280 నుంచి రూ.25,220కి తగ్గించింది.
తగ్గిన వేతన శ్రేణి వివరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన G.O.MS.No. 60 ఉత్తర్వుల ప్రకారం, గ్రామ పంచాయతీ కార్యదర్శుల గ్రేడ్ల పునర్విభజన, వేతన సవరణలో భాగంగా గ్రేడ్-III కార్యదర్శుల వేతన శ్రేణిని సవరించడం జరిగింది. గతంలో G.O.Rt.No. 91లో పేర్కొన్న రూ. 28,280 – 89,720 వేతన శ్రేణిని ఇప్పుడు రూ. 25,220 – 80,910 గా సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మార్పులకు అనుగుణంగా తక్షణమే తదుపరి చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ కమిషనర్‌ను ఆదేశించింది.
కమిషనర్‌కు ప్రభుత్వ ఆదేశాలు
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
పంచాయతీ కార్యదర్శుల వేతనాలపై ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.


