
📌 Key Points
- గుజరాత్‌లో సిగరెట్ తాగుతూ వైరల్ అయిన మైనర్ బాలుడు ‘సిగరెట్ వాలే బాబా’గా ప్రసిద్ధి చెందాడు.
- బాలుడికి డబ్బులు సమర్పించి కోరికలు తీర్చాలంటూ ప్రజలు గుమిగూడుతున్నారు.
- ఈ సంఘటనపై ఇంకా పోలీసులు చర్యలు తీసుకోలేదని విమర్శలు వస్తున్నాయి.
- బాలుడిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
గుజరాత్‌లో ఒక విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలుడు సిగరెట్ తాగుతూ వైరల్ కావడంతో, అతడిని ‘సిగరెట్ వాలే బాబా’గా పిలుస్తూ ప్రజలు డబ్బులు సమర్పిస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది.
సిగరెట్ వాలే బాబాగా మారిన మైనర్ బాలుడు
మన ఇండియాలో దొంగ బాబాలు చాలా మంది ఉన్నారు. మాయలు చేసి జనాల డబ్బులను దోచుకుంటున్నారు. దొంగ బాబాలు ఎంతో మంది తెరపైకి వచ్చిన కూడా, జనాలు మోసపోతునే ఉన్నారు. అయితే లేటెస్ట్ గా ఓ సిగరెట్ వాలే బాబా తెరపైకి వచ్చాడు. దాదాపు 14 సంవత్సరాల ఓ మైనర్ బాలుడు సిగిరెట్ తాగుతూ వైరల్ గా మారాడు. దీంతో అతడు సిగిరెట్ వాలే బాబా అంటూ జనాలు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. అంతేకాదు అతనికి డబ్బులు వేస్తూ తమ కోరికలు తీర్చాలంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
గుజరాత్ లోని మోర్బి ప్రాంతంలో ఓ మైనర్ బాలుడు, సిగరెట్లు తాగుతూ గాల్లోకి పొగలు ఊదడం మొదలు పెట్టాడు. బహిరంగ ప్రదేశంలోనే కుర్రాడు విపరీతంగా సిగరెట్లు తాగిన సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. దీంతో ఆ కుర్రాడిని సిగరెట్ వాలే బాబా అంటూ స్థానికులు ప్రచారం కూడా మొదలుపెట్టారు. భగవంతుని స్వరూపం అని నమ్మబలికారు. బహిరంగంగా సిగరేట్ కాల్చే ఆ కుర్రాడిని మందలించాల్సింది పోయి, బాబా అంటూ దండాలు పెట్టడం షురూ చేశారు. ఆ బాబాకు డబ్బులు వేసి కోరికలు కోరితే, అనుకున్నది సాధిస్తామని పిచ్చి నమ్మకాన్ని అందరూ నమ్మేలా చేశారు. అంతేకాదు ఈ కుర్రాడిని చూసేందుకు వచ్చే జనాలకు టెంట్లు, మంచినీటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఇంత తతంగం జరుగుతున్నా, పోలీసులు మాత్రం ఇంకా చర్యలు తీసుకోలేదు. ఇక ఈ సంఘటన వైరల్ అయిన తరుణంలో వెంటనే ఆ బాలుడిపై చర్యలు తీసుకోవాలని నెటిజెన్స్ పోస్టులు పెడుతున్నారు. క్లిక్
కోరికలు తీర్చాలంటూ ప్రజల రచ్చ
చర్యలు తీసుకోని పోలీసులు
మైనర్ బాలుడిని బాబాగా కొలవడం, అతనికి డబ్బులు సమర్పించడం వంటి మూఢనమ్మకాలను ప్రోత్సహించకూడదు. దీనిపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.


