
📌 Key Points
- శివజ్యోతి గర్భంపై అసత్య ప్రచారాలు ఖండించిన యాంకర్ శివజ్యోతి!
- ఐవీఎఫ్ ద్వారా కాదంటూ క్లారిటీ ఇచ్చిన శివజ్యోతి, వైరల్ అవుతున్న వీడియో!
- నెటిజన్ల కామెంట్లకు ఘాటుగా స్పందించిన శివజ్యోతి, హెల్త్ రిపోర్ట్స్ వ్యక్తిగతమని వెల్లడి!
- వ్యూస్ కోసం సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై కామెంట్లు చేయొద్దని యూట్యూబ్ ఛానల్స్‌కు వార్నింగ్!
యాంకర్ శివజ్యోతి తల్లి కాబోతున్నారనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఆమె ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిందంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం!
ఐవీఎఫ్ వార్తలపై శివజ్యోతి క్లారిటీ!
యాంకర్ శివజ్యోతి ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. తనదైన తెలంగాణ యాసతో వార్తలు చెబుతూ సావిత్రిగా.. పాపులారిటీ సంపాదించిన ఆమె, బిగ్‌బాస్ షోతో మరింత పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం శివజ్యోతి గర్భవతి అన్న విషయం అందరికీ తెలిసిందే. తన జీవితంలోని ఈ మధుర క్షణాలను ఎంజాయ్ చేస్తున్న శివజ్యోతి.. సోషల్ మీడియాలో కొందరు కావాలని చేస్తున్న తప్పుడు ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఆమె ఐవీఎఫ్ (IVF) పద్ధతి ద్వారా తల్లి కాబోతోందని, సహజంగా పిల్లలు పుట్టే అవకాశం లేక ఇలా చేసిందంటూ కొన్ని యూట్యూబ్ ఛానళ్లు థంబ్‌నెయిల్స్ పెట్టి వైరల్ చేస్తున్నారు.
సహజంగానే గర్భం దాల్చానన్న శివజ్యోతి!
తాజాగా, ఈ విషయంపై స్పందించి శివజ్యోతి ఓ వీడియోను షేర్ చేసింది. ‘‘నన్ను ప్రేమించే వారి కోసమే ఈ క్లారిటీ ఇస్తున్నాను. పెళ్లైన పదేళ్ల వరకు మేము పిల్లలను కావాలనుకోలేదు. అది మా వ్యక్తిగత నిర్ణయం. 30 ఏళ్లు దాటాక తల్లి కావాలని నేను ముందే అనుకున్నాను. నా శరీరం, నా జీవితం.. ఎప్పుడు బిడ్డను కనాలనేది నా ఇష్టం. ఇతరులకు దీనితో సంబంధం ఏంటి? అని ఫైర్ అయింది. తాము 2023 నుంచి పిల్లల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టామని, ఈ క్రమంలో ఎన్నో ఆసుపత్రులు తిరిగి, రకరకాల టెస్టులు చేయించుకున్నామని తెలిపారు. చివరికి తిరుమల శ్రీవారి వ్రతం చేసుకున్న తర్వాతే తాను సహజంగానే గర్భం దాల్చానని, ఐవీఎఫ్,ఐయూఐ ద్వారా ప్రెగ్నెన్సీ రాలేదని స్పష్టం చేసింది. ఒకవేళ ఐవీఎఫ్ చేయించుకున్నా అందులో తప్పేముంది ధైర్యంగా అందరితో చెప్పేదాన్ని అని చెప్పింది.
యూట్యూబ్ ఛానల్స్‌కు శివజ్యోతి వార్నింగ్!
ప్రస్తుతం ఏడు నెలల గర్భవతిగా ఉన్న శివజ్యోతి, రిపోర్టుల గురించి వస్తున్న కామెంట్లపై కూడా స్పందించింది. ‘‘నా హెల్త్ కండిషన్ ఎలా ఉంది? రిపోర్టులు ఏంటి? అనేవి నా వ్యక్తిగత విషయాలు. డాక్టర్లు కొన్ని విషయాలు రహస్యంగా ఉంచమన్నారు, అందుకే చెప్పడం లేదు. కేవలం వ్యూస్ కోసం సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఇలాంటి కామెంట్లు చేయకండి’’ అని యూట్యూబ్ ఛానళ్లకు వార్నింగ్ ఇచ్చింది. ఈ వయసులో తల్లి కాబోతున్నందుకు గర్వంగా ఉందని, ఇలాంటి నెగెటివ్ వార్తలు తన సంతోషాన్ని ఆపలేవని చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా, ఆమెకు మద్దతుగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
శివజ్యోతి తన గర్భం గురించి వస్తున్న తప్పుడు వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


