
📌 Key Points
- చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
- ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 93,000 మాగ్గం కుటుంబాలు లబ్ధి పొందుతాయి.
- ప్రభుత్వం ఈ పథకం కోసం ఏడాదికి రూ.150 కోట్లు వెచ్చించనుంది.
- చేనేత కార్మికులకు ఏడాదికి రూ.8,640 వరకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది.
రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. నేటి నుండి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనుంది. దీని ద్వారా లక్షలాది మంది చేనేత కుటుంబాలకు ఆర్థికంగా ఊరట లభించనుంది. ఈ పథకం ద్వారా చేనేత వృత్తికి మరింత ప్రోత్సాహం లభిస్తుంది.
చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం ప్రారంభం
రాష్ట్రంలోని చేనేతలకు భరోసా కల్పించే దిశగా కూటమి సర్కార్…. మరో అడుగు ముందుకేసింది. నేటి(ఏప్రిల్ 1) నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి రానుంది. లక్షలాది మంది చేనేత కళాకారుల కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ఈ స్కీమ్ ను చేపట్టింది.
ఈ పథకం ద్వారా మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్‌కు నెలకు 500 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందిస్తోంది. విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించి…. చేనేత వృత్తికి మరింత అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఎంత మందికి లబ్ధి? ప్రభుత్వం వ్యయం ఎంత?
ఉచిత విద్యుత్ పథకం అమలుతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 93,000 మాగ్గాలున్న కుటుంబాలు, 11,488 పవర్ లూమ్ కుటుంబాలు ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నాయి. దీని కోసం ప్రభుత్వం ఏడాదికి దాదాపు రూ.150 కోట్లు వెచ్చించనుంది. ఈ రాయితీ ద్వారా ఒక్కో చేనేత కార్మికుని కుటుంబానికి ఏడాదికి రూ.8,640, అలాగే పవర్ లూమ్ యూనిట్లకు ఏడాదికి రూ.21,600 వరకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. నేత వృత్తిలో విద్యుత్ ఒక అనివార్య ఖర్చుగా మారిన తరుణంలో… మగ్గాల నిర్వహణ, అల్లిక, డైయింగ్ వంటి పనుల కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ తోడ్పాటు నేతన్నలకు మద్దతుగా నిలవనుంది.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత…. నేతన్నలకు ఇచ్చే పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచింది. రూ.5 కోట్ల మేర త్రిఫ్ట్ ఫండ్ నిధులు చేనేత సహకార సంఘాలకు కేటాయించింది. ఆధునిక యంత్రాల కొనుగోలుపై 90 శాతం వరకు రాయితీ కల్పిస్తోంది. ముడి సరుకులపై 15 రాయితీ ఇవ్వడంతో పాటు, నాణ్యమైన నూలు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటోంది.
ఇతర పథకాలతో చేనేతలకు మరింత ప్రోత్సాహం
చిన్న క్లస్టర్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.10.44 కోట్లు నిధులు మంజూరు చేసింది. వీటితో పాటు మార్కెటింగ్ సదుపాయం కోసం అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థల ద్వారా నేరుగా వినియోగదారులు అమ్మకాలు జరిపేలా అవకాశం కల్పిస్తోంది. తాజాగా ఇప్పుడు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం ఒక గొప్ప ముందడుగు. దీని ద్వారా చేనేత కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించడమే కాకుండా, వారి జీవనోపాధికి మరింత వెసులుబాటు కలుగుతుంది. ప్రభుత్వం మరిన్ని సహాయక చర్యలు తీసుకుంటే ఈ పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది.


