|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తెలుగు సినిమాకు ఊపిరి: నంది అవార్డుల పునః ప్రారంభం! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

Published: 28-02-2026, 5:35 AM
తెలుగు సినిమాకు ఊపిరి: నంది అవార్డుల పునః ప్రారంభం! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
  • త్వరలో నంది అవార్డుల ప్రదానోత్సవానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.
  • నంది అవార్డుల ప్రధానోత్సవానికి కావలసిన ఏర్పాట్లు చేయాలని మంత్రి కందుల దుర్గేష్ అధికారులకు సూచన.
  • సినిమా స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని ప్రకటన.
  • రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి ఏపీలో చిత్ర పరిశ్రమకు అవార్డులు అందించనున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర విభజన తర్వాత నిలిచిపోయిన నంది అవార్డులను తిరిగి పునఃప్రారంభించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు.

నంది అవార్డుల పునరుద్ధరణ దిశగా ఏపీ ప్రభుత్వం

Nandi Awards: సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీలను ప్రోత్సహిస్తూ ఎన్నో అవార్డులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా అవార్డుల పేరుతో కళాకారులను గౌరవించడం గత కొంతకాలంగా ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వివిధ రకాల అవార్డుల పేరుతో కళాకారులను గౌరవిస్తూ వచ్చేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా కొనసాగుతున్న సమయంలో చిత్ర పరిశ్రమకు నంది అవార్డులను(Nandi Awrads) ప్రభుత్వం ప్రకటించి కళాకారులను సత్కరించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటివరకు నంది అవార్డులు ప్రకటించలేదు. ఇకపోతే తెలంగాణలోనంది అవార్డుల పేరును మారుస్తూ గద్దర్ అవార్డుల(Gaddar Awards) పేరుతో సినీ సెలబ్రిటీలను సత్కరించిన సంగతి తెలిసిందే.

ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఈ గద్దర్ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది కూడా గద్దర్ అవార్డులను అందించబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కార్ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే చిత్ర పరిశ్రమకు నంది అవార్డులను ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఈ విషయం గురించి మాట్లాడుతూ నంది అవార్డుల ప్రధానోత్సవానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి అంటూ ఈయన దిశా నిర్దేశాలు చేశారు.

అవార్డుల ప్రధానోత్సవానికి ఏర్పాట్లు

రాష్ట్ర ప్రతిష్టతను చాటి చెప్పే విధంగా చిత్ర పరిశ్రమకు నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు, టీవీ, థియేటర్ అవార్డులను త్వరలోనే ప్రకటిస్తామని ఈయన తెలియజేశారు. ఇక ఈ అవార్డుల ప్రధానోత్సవానికి సంబంధించి జ్యూరీ ఏర్పాటు, వేదికలు, అలాగే అవార్డు ప్రధానోత్సవ తేదీలపై త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించిన అనంతరం వీటిపై తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

నంది అవార్డులపై త్వరలోనే స్పష్టత..

సినిమా పరిశ్రమకు ప్రభుత్వం ప్రోత్సాహం

ఇక ఈ సమావేశంలో భాగంగా ఈయన ఆంధ్రప్రదేశ్లో ఫిలిం డెవలప్మెంట్ గురించి అలాగే ఆంధ్రప్రదేశ్లో సినిమాల షూటింగ్ ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో సినిమా స్టూడియోలు డబ్బింగ్ థియేటర్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు అలాంటి వారికి తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందజేస్తుందంటూ ఈ సందర్భంగా దుర్గేష్ తెలిపారు. ఇలా ఆగిపోయిన నందులు మళ్లీ రాబోతున్నాయనే విషయం తెలియడంతో చిత్ర పరిశ్రమ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి ఏపీ నుంచి చిత్ర పరిశ్రమకు అవార్డులు రాబోతుండటం విశేషం. ఇక త్వరలోనే ఈ అవార్డులకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా వెల్లడించబోతున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ నంది అవార్డులు రావడం తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక శుభసూచకం. దీని ద్వారా మరింతమంది కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.