
📌 Key Points
- ఏపీ ఐసెట్ 2026 దరఖాస్తు గడువు మార్చి 23 వరకు పొడిగింపు.
- లేట్ ఫీజుతో మార్చి 24 నుండి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తుకు అవకాశం.
- ఏప్రిల్ 6న అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
- మొత్తం 200 మార్కులకు ఐసెట్ పరీక్ష, రెండున్నర గంటల సమయం.
ఏపీలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ 2026 దరఖాస్తు గడువును అధికారులు మరోసారి పొడిగించారు. మార్చి 23 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు చూడండి.
ఐసెట్ 2026 దరఖాస్తు గడువు పెంపు
రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ – 2026 దరఖాస్తుల గడువును పొడిగించారు. ఎలాంటి లేట్ ఫీజు లేకుండా మార్చి 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.
డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఏపీ ఐసెట్ ఎగ్జామ్ రాసేందుకు అర్హులవుతారు. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా… క్వాలిఫై అయిన అభ్యర్థులకు 2026- 27 విద్యా సంవత్సరానికిగానూ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
లేట్ ఫీజుతో దరఖాస్తు వివరాలు
ఇక రూ. 1000 ఫైన్ తో మార్చి 24వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. రూ. 2 వేల ఫైన్ తో అయితే మార్చి 29 వరకు, రూ. 4 వేల ఫైన్ తో ఏప్రిల్ 1 వరకు ఛాన్స్ ఉంది. రూ. 10 వేల ఆలస్య రుసుంతో ఏప్రిల్ 5వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 6వ తేదీన అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది.
పరీక్ష విధానం, ముఖ్యమైన తేదీలు
ఇక ఏపీ ఐసెట్ – 2026 పరీక్షను మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. రెండున్నర గంటల సమయం ఉంటుంది. ఎంట్రెన్స్ పరీక్షల నిర్వహణ తర్వాత ప్రాథమిక కీలను ప్రకటిస్తారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆ తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు.
ఏపీ ఐసెట్ 2026కు దరఖాస్తు చేసుకొనేందుకు ఇది మంచి అవకాశం. అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. పరీక్షకు సన్నద్ధం కండి.


