
📌 Key Points
- AP IIIT కౌన్సెలింగ్ నేటి నుంచి నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ప్రారంభం.
- పదో తరగతి మార్కులు, రిజర్వేషన్లు, గ్రామీణ విద్యార్థుల డిప్రెవేషన్ స్కోర్ ఆధారంగా ఎంపిక.
- అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో హాజరుకావాలి.
- పారదర్శక ప్రక్రియ కోసం హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు, సీటు పొందినవారు గడువులోగా ఫీజు చెల్లించాలి.
ఆంధ్రప్రదేశ్‌లోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త. నేటి నుంచి AP IIIT కౌన్సెలింగ్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. పదో తరగతి మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులు తమ భవిష్యత్తును నిర్దేశించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ ప్రక్రియలో అవసరమైన పత్రాల వివరాలను తెలుసుకుందాం.
కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం
AP IIIT Counselling Documents 2026 : ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) పరిధిలోని ట్రిపుల్ ఐటీ (IIIT) క్యాంపస్‌లలో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. నేటి నుంచి ట్రిపుల్ ఐటీ సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పదో తరగతిలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా ఇప్పటికే ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను అధికారులు విడుదల చేశారు. ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్న విద్యార్థులకు నిర్దేశిత కేంద్రాల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
ఈ విద్యాసంవత్సరానికి గానూ నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో సీట్ల కేటాయింపు ప్రక్రియ ఈ కౌన్సెలింగ్ ద్వారా జరుగుతుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేలు చేసేలా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి కేటాయించిన డిప్రెవేషన్ స్కోర్‌ను కలుపుతూ ఈ మెరిట్ జాబితాను సిద్ధం చేశారు. ఎంపికైన అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీలు… సమయాల ప్రకారం కౌన్సెలింగ్ కేంద్రాలకు హాజరుకావాల్సి ఉంటుంది.
అవసరమైన పత్రాల జాబితా
కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు వాటికి సంబంధించిన రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. అధికారులు పరిశీలన కోసం అడిగే ముఖ్యమైన పత్రాల వివరాలను ఇక్కడ తెలుసుకోండి….
కౌన్సెలింగ్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ఆర్జీయూకేటీ యంత్రాంగం అన్ని క్యాంపస్‌లలో ప్రత్యేక హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేసింది. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన వెంటనే విద్యార్థులకు సీట్ల కేటాయింపు ఆర్డర్లను అందజేస్తారు. సీటు పొందిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా సంబంధిత క్యాంపస్‌లలో ఫీజు చెల్లించి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రయాణ సమయాల్లో ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకు విద్యార్థులు…. తల్లిదండ్రులు ముందే ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.
సీట్ల కేటాయింపు, తదుపరి చర్యలు
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
AP IIIT కౌన్సెలింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుంది. విద్యార్థులు తమ పత్రాలను సిద్ధం చేసుకుని, నిర్దేశిత తేదీల్లో హాజరై సీటు పొందాలి. ఇది వారి ఉన్నత విద్యకు ఒక ముఖ్యమైన మెట్టు. అందరికీ ఆల్ ది బెస్ట్.

