|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల రూపురేఖలు మార్పు! డివిజన్ల పెంపుతో రాజకీయ ప్రకంపనలు!

Published: 01-04-2026, 9:05 PM
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల రూపురేఖలు మార్పు! డివిజన్ల పెంపుతో రాజకీయ ప్రకంపనలు!
  • ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపల్ కార్పొరేషన్లలో డివిజన్ల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
  • జీవీఎంసీలో డివిజన్ల సంఖ్య 98 నుంచి 120కి పెరిగింది.
  • విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో డివిజన్ల సంఖ్య 64 నుంచి 86కు పెరిగింది.
  • గుంటూరు కార్పొరేషన్‌లో 19 డివిజన్లు పెరగడంతో మొత్తం డివిజన్ల సంఖ్య 76కు చేరింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో డివిజన్ల సంఖ్యను పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నిర్ణయం రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉంది.

డివిజన్ల పెంపునకు ప్రభుత్వ జీవో

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లలో డివిజన్ల సంఖ్యను పెంచుతూ ఏపీ మున్సిపల్ పరిపాలన శాఖ ఒక జీవో జారీ చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ల(ఎన్నికైన సభ్యుల సంఖ్యను నిర్ధారించే) నియమావళి, 2005ను సవరించింది. డివిజన్ల సంఖ్య పెరగడం వల్ల అన్ని కార్పొరేషన్లలో ప్రస్తుత రాజకీయ సమీకరణాలు మారతాయి. అలాగే మేయర్ ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు.

జీవీఎంసీ లో ప్రస్తుతం 98 డివిజన్లు ఉన్నాయి. వీటిని 120 డివిజన్లకు పెంచారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో డివిజన్ల సంఖ్య 64 నుంచి 86కు పెరిగాయి. గుంటూరు కార్పొరేషన్‌లో ప్రస్తుతం ఉన్న 57 డివిజన్లతో పాటు అదనంగా 19 డివిజన్లు చేరాయి. దీంతో ఆ సంఖ్య 76కు పెరుగుతుంది. అదేవిధంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో డివిజన్ల సంఖ్యను 18 పెంచారు. కర్నూలు, తిరుపతి, కడప కార్పొరేషన్లలో సంఖ్య 16 పెరిగింది. ఏలూరు, అనంతపురం, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లలో డివిజన్ల సంఖ్య 12 పెరిగింది.

ఏ కార్పొరేషన్‌లో ఎన్ని డివిజన్లు పెరిగాయి?

రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్ల లో డివిజన్ల సంఖ్యను పెంచుతూ మున్సిపల్ పరిపాలన కమిషనర్, డైరెక్టర్ డాక్టర్ పి.సంపత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీలోని అత్యధిక పుర, నగరపాలక సంస్థల్లో పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. దీంతో ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి వచ్చింది. ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే డివిజన్ల పెంపు జరిగింది. మున్సిపాలిటీలో వార్డులను కూడా పెంచనుంది ప్రభుత్వం.

రాజకీయాలపై డివిజన్ల పెంపు ప్రభావం

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.

హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More

రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో డివిజన్ల పెంపు రాబోయే ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనుంది. రాజకీయ పార్టీలు ఈ మార్పులకు అనుగుణంగా తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.