
📌 Key Points
- ఏపీ పాలిసెట్-2026 దరఖాస్తు గడువు రేపటితో ముగుస్తుంది (ఏప్రిల్ 9).
- ఓసీ, బీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.400, ఎస్సీ, ఎస్టీలకు రూ.100.
- ఏప్రిల్ 25న పాలిసెట్ పరీక్ష నిర్వహించబడుతుంది.
- పాలిటెక్నిక్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
ఏపీలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు పాలిసెట్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 2026-27 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ డిప్లోమా సీట్లను భర్తీ చేస్తారు. దరఖాస్తు గడువు రేపటితో ముగుస్తుంది.
దరఖాస్తు గడువు వివరాలు
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 2026 – 2027 విద్యా సంవత్సరానికి గానూ ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ డిప్లోమా సీట్లను భర్తీ చేస్తారు.
ఇప్పటికే ఏపీ పాలిసెట్ – 2026 దరఖాస్తుల గడువును పొడిగించారు. ఈ గడువు కూడా రేపటితో (ఏప్రిల్ 9) ముగియనుంది. కాబట్టి అర్హులైన విద్యార్థులు… వెంటనే ఆన్ లైన్ ద్వారా దఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. మరోసారి గడువు పెంచే అవకాశం ఉండదని.. ఇదే చివరి అవకాశమని స్పష్టం చేశారు.
ఏపీ పాలిసెట్ – 2026 అప్లికేషన్ ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 100గా నిర్ణయించారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఏపీ పాలిసెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా గతేడాదిలో పదో తరగతి పాస్ అయిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవటానికి అర్హులవుతారు.
పరీక్ష తేదీ మరియు ముఖ్యమైన సమాచారం
ఏపీ పాలిసెట్ – 2026 పరీక్షలను ఏప్రిల్ 25వ తేదీ నిర్వహిస్తారు. ఎగ్జామ్ నిర్వహణకు 7 రోజుల ముందు హాల్ టికెట్లను విడుదల చేస్తారు. పరీక్ష పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటిస్తారు. అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత తుది కీలతో పాటు ఫలితాలను ప్రకటిస్తారు.
జవాబు: పొడిగించిన గడువు ప్రకారం ఏప్రిల్ 9వ తేదీ దరఖాస్తుకు చివరి అవకాశం.
జవాబు: ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 25వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్ణీత కేంద్రాల్లో నిర్వహిస్తారు.
పాలిటెక్నిక్ కోర్సులతో ఉద్యోగ అవకాశాలు
జవాబు: అవును, ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరూ ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే.
పాలిటెక్నిక్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ప్రతి ఏటా ప్రాంగణ నియామకాలు చేపడుతుంటారు. వివిధ కంపెనీల ప్రతినిధులు కళాశాలకే వచ్చి విద్యార్థులను మంచి ప్యాకేజీలకు తీసుకుంటారు. అంతేకాకుండా ప్రభుత్వ రంగాల్లోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలుంటాయి.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
పాలిసెట్ ద్వారా పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరి మంచి భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు. అర్హులైన విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇది చివరి అవకాశం అని అధికారులు తెలిపారు.


