
📌 Key Points
- 60 ఏళ్లు పైబడిన ఉపాధ్యాయులకు స్పాట్ వాల్యుయేషన్ నుండి మినహాయింపు ఇవ్వాలని ఏపీటీఎఫ్ డిమాండ్.
- 10వ తరగతి బోధించని ఉపాధ్యాయులకు స్పాట్ వాల్యుయేషన్ విధులు అప్పగించారని ఉపాధ్యాయ సమాఖ్య ఆరోపణ.
- ఏప్రిల్ 6 నుంచి 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కానుంది.
- ఈసారి ట్యాబ్‌లలో మార్కులు నమోదు చేయనుండగా, పకడ్బందీగా స్పాట్ ప్రక్రియ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం.
ఏపీలో టెన్త్ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉపాధ్యాయ సమాఖ్య పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. వయో పరిమితి, ఇతర సమస్యలపై విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు.
ఉపాధ్యాయ సమాఖ్య డిమాండ్లు
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్) పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీన్ అన్సారీని కలిసి.. స్పాట్ వాల్యుయేషన్ విధులకు సంబంధించిన సమస్యలపై చర్చించింది. నిబంధనల ప్రకారం 60 ఏళ్లు పైబడిన వారికి 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ విధుల నుండి మినహాయింపు ఉండాలి.. కానీ దానికి విరుద్ధంగా కొన్ని సందర్భాల్లో వారికే ఆ విధులు అప్పగించారని ఏపీటీఎఫ్ ఆరోపించింది.
అంతేకాకుండా 10వ తరగతికి బోధించని ఉపాధ్యాయులకు కూడా ఈ పనిని అప్పగించారని ఉపాధాయ్య సమాఖ్య చెబుతోంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉపాధ్యాయులతో పాటు, జిల్లా కేంద్రాలకు దూరంగా ఉన్న మండలాలకు చెందిన ఉపాధ్యాయులను కూడా స్పాట్ విధుల నుండి మినహాయించాలని కోరింది.
అన్నమయ్య జిల్లా నుండి తిరుపతి లో విలీనమైన మండలాల ఉపాధ్యాయులకు కూడా స్పాట్ విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని సమాఖ్య నాయకులు కోరారు. ఉపాధ్యాయ సంఘాలతో సమీక్ష నిర్వహించి, సిలబస్ నుండి అశాస్త్రీయమైన అంశాలను తొలగించాలని కూడా సమాఖ్య నాయకులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించాలన్నారు.
స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ
ఏపీ టెన్త్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 6వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 15వ తేదీ తో అన్ని సబ్జెక్ట్ పేపర్లను పూర్తి చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యాచరణను సిద్ధం చేసింది. స్పాట్ జరిగే కేంద్రాలతో పాటు సిబ్బంది నియామకం, ఇతర అంశాలపై ఫోకస్ పెట్టింది.
గతేడాది టెన్త్ మార్కుల కౌంటింగ్‌లో కొన్ని తప్పిదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈసారి అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా పకడ్బందీగా స్పాట్ ప్రక్రియను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తప్పు చేసిన సిబ్బందికి జరిమానా విధించేలా నిబంధనలు తీసుకొచ్చింది. ఈసారి ట్యాబ్‌లలో మార్కులు నమోదు చేయనున్నారు. పేపర్ల మూల్యాంకనంతో పాటు మార్కుల ఎంట్రీ వరకు ప్రతిదీ దశల వారీగా చేసి ప్రాసెస్ పూర్తి చేస్తారు.
ప్రభుత్వ చర్యలు
ఏప్రిల్ 1వ తేదీతో అన్ని పరీక్షలు పూర్తయ్యాయి. ఈసారి మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 6,22,074 మంది రెగ్యులర్ అభ్యర్థులు, 18,842 మంది ప్రైవేట్ అభ్యర్థులు ఉన్నారు. 3,28,652 మంది బాలురు, 3,12,264 మంది బాలికలు ఉన్నారు. ఏప్రిల్ మూడో వారం లేదా నాల్గో వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
ఏపీ టెన్త్ పరీక్షల మూల్యాంకనం సజావుగా సాగాలని, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఆశిద్దాం. ఫలితాల వెల్లడి కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.

