|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఏపీలో డబుల్ డేంజర్: మండుతున్న ఎండలు, ఉరుములతో కూడిన వర్షాలు!

Published: 01-05-2026, 5:35 PM
  • నెల్లూరు జిల్లా గూడూరులో 45.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.
  • 216 మండలాల్లో 41 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డు.
  • శ్రీకాకుళం, విజయనగరం సహా 9 జిల్లాలకు వర్షాలు, పిడుగుల హెచ్చరిక.
  • పిడుగుల సమయంలో చెట్ల కింద ఉండవద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచన.

APలో వాతావరణం అనూహ్యంగా మారింది. ఒకవైపు భానుడి ప్రతాపంతో మండుతున్న ఎండలు, మరోవైపు అకాల వర్షాలు, పిడుగుల ముప్పు పొంచి ఉంది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

ఏపీలో ఎండల తీవ్రత: 45.8 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు

AP Weather Alert : ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒకవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ నిప్పుల వర్షం కురిపిస్తుంటే, మరోవైపు అకాల వర్షాలు, పిడుగుల ముప్పు పొంచి ఉంది. ఈ రెండు రోజుల పాటు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన ద్వారా హెచ్చరించింది.

ఈ వేసవి సీజన్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రత నెల్లూరు జిల్లా గూడూరులో నమోదైంది. గురువారం ఇక్కడ ఉష్ణోగ్రత 45.8 డిగ్రీల మార్కును తాకింది. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. దాదాపు 216 మండలాల్లో 41 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మండుతున్న ఎండలకు తోడు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

ఇవాళ రాష్ట్రంలోని 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఇందులో పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాలున్నాయి. మరికొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే సూచనలున్నాయి.

అకాల వర్షాలు, పిడుగుల ముప్పు: జిల్లాల వారీగా హెచ్చరికలు

ఎండలు ఒకవైపు దంచికొడుతుంటే… వాతావరణంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు వర్ష సూచన ఉంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

పొలాల్లో పనులు చేసే రైతులు, కూలీలు వాతావరణం మారినప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. “ఆకాశం మేఘావృతమై వర్షం పడే సూచనలు ఉన్నప్పుడు లేదా ఉరుములు వినిపించినప్పుడు రైతులు, కూలీలు పొలాల్లోని చెట్ల కింద ఆశ్రయం పొందకూడదు” అని స్పష్టం చేస్తోంది. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఉండటం అత్యంత ప్రమాదకరమని, సురక్షితమైన కట్టడాల లోపలికి వెళ్లాలని పేర్కొంది. పశువుల కాపరులు కూడా తమ పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు సూచిస్తున్నారు.

ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: విపత్తుల సంస్థ సూచనలు

ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో….. వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లలు మధ్యాహ్నం వేళ బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని… శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా చూసుకోవాలని కోరారు.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

మొత్తంగా, ఏపీలో ఎండలు, వర్షాలు, పిడుగుల రూపంలో డబుల్ డేంజర్ పొంచి ఉంది. ప్రజలు, రైతులు, పశువుల కాపరులు తగిన జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.