
📌 Key Points
- విజయ్ సేల్స్ లో ఐఫోన్ 17 ప్రో పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.
- ఈ ఫోన్ 6.3-అంగుళాల డిస్‌ప్లే, A19 ప్రో చిప్‌సెట్‌తో వస్తుంది.
- వెనుకవైపు 48MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.
- ఒక్కసారి ఛార్జ్ చేస్తే 39 గంటల వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది.
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో ఇప్పుడు భారీ తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. విజయ్ సేల్స్ ఈ ఫోన్‌పై ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఫోన్ ఫీచర్లు మరియు డిస్కౌంట్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 17 ప్రోపై భారీ తగ్గింపు
Apple iPhone 17 Pro : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో ధర భారీగా తగ్గింది. విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైటులో ఈ ప్రీమియం ఐఫోన్ రూ. 1,32,490కే లభిస్తోంది. ఈ డీల్ వివరాలు ఇలా ఉన్నాయి.
Apple iPhone 17 Pro : మీరు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 17 ప్రో భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ప్రస్తుతం విజయ్ సేల్స్ ఈ ఐఫోన్ 17 ప్రోపై రూ. 8వేలకు పైగా డిస్కౌంట్ అందిస్తోంది.
దేశీయ మార్కెట్లో ఫస్ట్ రూ. 1,34,900 ధరకు లాంచ్ అయిన ఈ ఫోన్‌లో 6.3-అంగుళాల డిస్‌ప్లే, ఆపిల్ A19 ప్రో చిప్‌సెట్, 48MP ట్రిపుల్ ఫ్యూజన్ కెమెరా సిస్టమ్‌తో పాటు అనేక ఇతర ఫ్లాగ్‌షిప్-లెవల్ ఫీచర్లు ఉన్నాయి. ఇలాంటి ప్రీమియం ఫోన్లపై డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఈ డీల్ వివరాలపై ఓసారి లుక్కేయండి.
ఐఫోన్ 17 ప్రో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో డీల్ : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 17 ప్రో రూ. 1,34,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 1,32,490కే లభిస్తోంది. రూ. 2,410 నేరుగా ధర తగ్గింపు పొందవచ్చు. కొనుగోలుదారులు HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 6వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐపై రూ. 4500 డిస్కౌంట్ పొందవచ్చు.
Read Also : Vivo T5 Pro : గేమర్లకు పండగే.. 9,020mAh భారీ బ్యాటరీతో వివో కొత్త 5G ఫోన్ వస్తోందోచ్.. కీలక ఫీచర్లు, ధర వివరాలు లీక్..
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో 120Hz ప్రోమోషన్ టెక్నాలజీతో 6.3-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. సెరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఈ ఐఫోన్ A19 ప్రో చిప్‌సెట్‌తో 12GB వరకు ర్యామ్ అందిస్తుంది. టెక్ దిగ్గజం ప్రకారం.. ఈ హ్యాండ్‌సెట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 39 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది.
ఐఫోన్ 17 ప్రో కొనడానికి ఇది సరైన సమయమా?
కెమెరాల విషయానికి వస్తే.. ఐఫోన్ 17 ప్రో బ్యాక్ సైడ్ 48MP ట్రిపుల్ ఫ్యూజన్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 48MP మెయిన్, 48MP అల్ట్రావైడ్ 48MP టెలిఫోటో లెన్స్‌లు ఉన్నాయి. 8x వరకు ఆప్టికల్ జూమ్ 8K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్‌లో 18MP కెమెరా కూడా ఉంది.
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో కొనాలా? వద్దా? : ఆపిల్ ఐఫోన్ 18 ప్రో లైనప్ సెప్టెంబర్ 2026లో లాంచ్ కానుంది. అంతకన్నా ముందే ఆపిల్ ఐఫోన్ 17 ప్రో కొనాలని అనుకుంటే కొనేసుకోవచ్చు. ఈ ఐఫోన్ మోడల్ A19 ప్రో చిప్, 48MP ట్రిపుల్-కెమెరా సిస్టమ్ 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ అందిస్తుంది. మీ ప్రస్తుత ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ద్వారా ఈ డిస్కౌంట్ పొందవచ్చు.
ఆపిల్ ఐఫోన్ 18 ప్రో విడుదలయ్యేలోపు ఐఫోన్ 17 ప్రో కొనుగోలు చేయాలనుకుంటే, ఇది మంచి అవకాశం. డిస్కౌంట్ ఆఫర్ ముగిసేలోపు కొనేయండి.


