|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మురుగదాస్ చిక్కుల్లో: 60 కోట్ల కుంభకోణం! ‘ఠాగూర్’ సీక్వెల్‌తో గట్టెక్కుతారా?

Published: 29-03-2026, 1:35 PM
మురుగదాస్ చిక్కుల్లో: 60 కోట్ల కుంభకోణం! 'ఠాగూర్' సీక్వెల్‌తో గట్టెక్కుతారా?
  • మురుగదాస్ ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
  • రూ. 60 కోట్ల బడ్జెట్ కుంభకోణంలో చిక్కుకున్న మురుగదాస్.
  • ‘మదరాశి’ సినిమా బడ్జెట్ విషయంలో భారీగా తేడాలు.
  • నష్టాన్ని పూడ్చేందుకు ‘ఠాగూర్ 2’ కథను ఉచితంగా ఇచ్చేందుకు మురుగదాస్ అంగీకారం.

ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ప్రస్తుతం 60 కోట్ల రూపాయల కుంభకోణంలో చిక్కుకున్నారు. దీనికి పరిష్కారంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘ఠాగూర్’ సీక్వెల్‌ను ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.

మురుగదాస్ కెరీర్‌లో ఊహించని మలుపు

AR Murugadoss controversy: మురుగదాస్ .. గజిని, తుపాకీ, స్టాలిన్ వంటి సినిమాలతో ఒకప్పుడు సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా క్రేజ్ కొట్టేశాడు.ఇక ఈయనతో సినిమా అంటే అప్పట్లో ప్రొడ్యూసర్స్ అంతా క్యూ లో ఉండేవాళ్ళు.కట్ చేస్తే ఇపుడు సీన్ రివర్స్ అయ్యింది. ఈయన గారి పేరు చెబితేనే ప్రొడ్యూసర్స్ గజగజ వణికిపోతున్నారట. ఒకరకంగా ఏఆర్ మురుగదాస్ కెరీర్ ఇప్పుడు డిజాస్టర్ ఫిలిం కన్నా దారుణంగా తయారైంది.పై పెచ్చు ఇప్పుడీయన ఏకంగా 60 కోట్ల బడ్జెట్ కుంభకోణంలో ఇరుక్కుని కోలీవుడ్ పంచాయితీ మెట్లెక్కడం హాట్ టాపిక్ అయిపొయింది.

115 కోట్లబడ్జెట్ కాస్తా 170 కోట్లు

మ్యాటర్ లోకి ఎంట్రీ ఇస్తే ..గతేడాది మురుగదాస్ నుంచి వచ్చిన ‘ సికందర్’ ( సల్మాన్ ఖాన్),’ మదరాశి’ ( శివకార్తికేయన్) సినిమాలు ఆడియన్స్ ని ఏ రేంజ్‌లో టార్చర్ పెట్టాయో చెప్పక్కర్లేదు. అయితే, అదే ‘ మదరాశి’ సినిమా వెనుక జరిగిన అసలు భాగోతం ఇప్పుడు బయటపడింది.సినిమాని మొదలుపెట్టేటప్పుడు రూ.115 కోట్లలో తీసేస్తా అని భీరాలు పలికి తీరా షూటింగ్ అయిపోయే సమయానికి ఆ బడ్జెట్ కాస్తా 170 కోట్లకు పెంచేశాడట.అంటే లెక్కాపత్రం లేకుండా ఎక్స్ట్రా గా రూ.55 కోట్లు ఖర్చు చేయించి నిర్మాతను రోడ్డున పడేశాడన్నమాట!

60 కోట్ల కుంభకోణంలో చిక్కుకున్న డైరెక్టర్

ఉచితంగా రమణ 2′ (ఠాగూర్ సీక్వెల్) కథ

అయితే ఒక పక్క శివకార్తికేయన్‌తో సినిమా చేస్తూనే, కళ్లు మాత్రం సల్మాన్ ఖాన్ ‘ సికందర్’ మీద పెట్టారట. దీంతో  సరైన ప్లానింగ్ లేక, ఒకేసారి రెండు పడవల మీద ప్రయాణం చేయడం వల్ల బడ్జెట్ ఇలా కొండలా పెరిగిపోయిందన్నది ఇన్ సైడ్ టాక్.అయితే తాజాగా ఈ ఇష్యూ కోలీవుడ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ దగ్గరకు వెళ్లడంతో మురుగదాస్  ఏం చేయాలో తెలీక ఒక షాకింగ్ డిసీషన్ తీసుకున్నాడన్న వార్తలు కోలీవుడ్ కోడై కూస్తుంది. ప్రొడక్షన్ హౌస్ కి జరిగిన భారీ నష్టానికి పూడ్చేందుకు మురుగదాస్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘ రమణ 2′ ( ఠాగూర్ సీక్వెల్) కథను ఆ నిర్మాతలకి సదరు నిర్మాతకు ఉచితంగా రాసిచ్చేందుకు అంగీకరించారట.

‘ఠాగూర్’ సీక్వెల్‌తో వివాదానికి పరిష్కారం?

స్టార్ డైరెక్టర్ కాస్తా ఇప్పుడు ‘ ఘోస్ట్ రైటర్’ రేంజ్‌

అంటే, ఒకప్పటి స్టార్ డైరెక్టర్ కాస్తా ఇప్పుడు ‘ ఘోస్ట్ రైటర్’ రేంజ్‌కి పడిపోయి, పాత బకాయిలు తీర్చుకోవడానికి తన స్క్రిప్టులను తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్న మాట.ఇక రియాలిటీ చూస్తె ప్రస్తుతానికి మురుగదాస్ చేతిలో ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా లేనట్టే కనిపిస్తుంది .మరో వైపు ఏ బడా స్టార్ కూడా  హీరో కూడా ఈయన వైపు చూడ్డానికి డేర్ చెయ్యట్లేదు .ఏది ఏమైనా ఒకప్పుడు ‘ తుపాకీ’ తో రికార్డులు పేల్చిన ఈ డైరెక్టర్, ఇప్పుడు తన సొంత కెరీర్‌నే ఇలా పేల్చేసుకున్నారన్నమాట!

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా వెలుగొందిన మురుగదాస్, ఇప్పుడు పాత బకాయిలు తీర్చుకోవడానికి తన స్క్రిప్టులను తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి రావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.