|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

AR Murugadoss: కుమార్తె హల్దీ వేడుకల్లో స్టార్ డైరెక్టర్ డ్యాన్స్

Published: 16-06-2025, 9:24 AM
AR Murugadoss: కుమార్తె హల్దీ వేడుకల్లో స్టార్ డైరెక్టర్ డ్యాన్స్

ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కుటుంబంలో హల్దీ వేడుక జరిగింది. ఈ వేడుకలో మురుగదాస్ తన కుమార్తె, కుమారునితో కలిసి డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. వారి డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Key Points

1

ఏఆర్ మురుగదాస్ కుమార్తె హల్దీ వేడుకలో డ్యాన్స్‌తో అదరగొట్టారు.

2

కూతురు, కొడుకుతో కలిసి 'కనిమా' పాటకు స్టెప్పులేశారు.

4

సాధారణంగా సైలెంట్‌గా ఉండే మురుగదాస్ ఈ వేడుకలో చాలా యాక్టివ్‌గా కనిపించారు.

ఏఆర్ మురుగదాస్ కుటుంబ వేడుక

స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. స్వతహాగా తమిళుడు అయినప్పటికీ.. గజిని, తుపాకీ తదితర సినిమాలతో టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తర్వాత చిరంజీవితో ‘స్టాలిన్’, మహేశ్ బాబుతో ‘స్పైడర్’ సినిమాలు కూడా తీసి ఆకట్టుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత ఈ ఏడాది ‘సికిందర్’ మూవీతో వచ్చారు గానీ ఘోరమైన ఫ్లాప్‌గా నిలిచింది. ప్రస్తుతం తమిళ హీరో శివకార్తికేయన్‌తో ‘మదరాసి’ మూవీ చేస్తున్నారు.

వైరల్ అవుతున్న డ్యాన్స్ వీడియో

మురుగదాస్ ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ ఒకటి సోమవారం జరిగింది. అయితే ఇది మురుగదాస్ కూతురు దివ్య హల్దీ వేడుక అని అంటున్నారు. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. సరే అసలు విషయానికొస్తే.. ఈ వేడుకలో మురుగదాస్ డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. కూతురు, కొడుకుతో కలిసి రీసెంట్ ట్రెండీ సాంగ్ ‘కనిమా’ పాటకు స్టెప్పులేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

‘కనిమా’ పాటకు సందడి

2005లో మురుగదాస్‪‌కి పెళ్లి కాగా.. కొన్నాళ్లకు కొడుకు-కూతురు పుట్టారు. ప్రస్తుతం కూతురు పెళ్లి వేడుకకు ముందు జరిగే హల్దీ అంటున్నారు. మరికొందరు మాత్రం కూతురు రజస్వల వేడుక అని అంటున్నారు. ఏదేమైనా ఎప్పుడు సైలెంట్‌గా ఉండే మురుగదాస్ మాత్రం కూతురు, కొడుకుతో కలిసి డ్యాన్స్ మాత్రం ఇరగదీశారని చెప్పొచ్చు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేసేయండి.

చివరగా, ఏఆర్ మురుగదాస్ కుటుంబంతో కలిసి ఆనందంగా డ్యాన్స్ చేసిన వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ వేడుకలో ఆయన సంతోషాన్ని ప్రతిబింబించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.